సినిమా మొత్తం లీక్ అయ్యే ప్రమాదంలో స్పైడర్?  

లీకేజ్ భూతం ఏ పెద్ద సినిమానూ వదలడం లేదు. మరీ ముఖ్యంగా సినిమా తమిళంలోకి డబ్ అవుతున్నా, స్ట్రెయిట్ గా విడుదల అవుతున్నా, ఈ ప్రమాదం ఎక్కువ పొంచి ఉంటుంది. లీకేజ్/పైరసీ లాంటి చీకటి కార్యకలాపాలకు మన దేశంలో ప్రధాన కేంద్రంగా మారింది తమిళనాడు. బాహుబలి ట్రైలర్, సన్నివేశాలు, అన్ని తమిళం నుంచే లీక్ అయ్యాయి. స్పైడర్ సంగతి కూడా అలానే తయారయ్యింది.

ఈ సినిమాకి సంబంధించి ఒక టీజర్, ఒక ట్రైలర్, విడుదలకి చాలా సమయం ముందే లీక్ అయిపోయాయి. ఇక స్పైడర్ లో మహేష్ బాబు ఇంట్రొడక్షన్ సాంగ్, అలాగే మొదటి ఫైట్ ఇప్పటికే ఇంటర్నెట్ ప్రపంచంలోకి లీక్ రూపంలో వచ్చేసాయట. ఇక సినిమా మొత్తం లీక్ అయ్యే ప్రమాదం ఉందని, తమిళ సినిమా రంగానికి నిద్రలేని రాత్రులని ఇస్తున్న ఓ రెండు పైరసి సైట్లు స్పైడర్ ని లీక్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయని తెలియవస్తోంది.

సినిమా రేపే విడుదల. 120 కోట్లు పెట్టారు నిర్మాతలు. 130 కోట్లు పెట్టారు పంపిణీదారులు. జాగ్రత్త పడి నిర్మాతలు అడ్టుకోలేకపోతే అనర్థాలు జరుగుతాయి. ఎక్కడో పరాయిదేశాల నుంచి పనిచేస్తున్న ఈ పైరసీ మాఫియాని ఎంత ప్రయత్నించినా పట్టుకోలేకపోతున్నారు తమిళ సినిమా వారు. ఏళ్ళుగా తమిళ నిర్మాతల మండలి చేయలేకపోయినా పనిని మన తెలుగు నిర్మాతలు చేసి చూపించగలరా? సాధ్యపడే విషయమేనా 120 కోట్లు, వేల జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఇలాంటి వార్తలు భయాందోళన కలిగించేవే. ఏదైనా చెడు జరిగితే, భవిష్యత్తు లో మళ్ళీ తమిళ సినిమా చేయడానికి సంశయిస్తారు మన హీరోలు.