Spoiled Coconut in puja …Is it a bad sign??

మన హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏ పూజ చేసిన, ఏ శుభకార్యం చేసిన కొబ్బరికాయ ఉండాల్సిందే. అలాగే గుడికి వెళ్ళినప్పుడు కూడా కొబ్బరికాయ తీసుకువెళ్లడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది.అలాంటి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళితే అందరూ అశుభం అని భావించి చాలా బాధపడుతూ ఉంటారు.