12 ఏళ్ల కొడుక్కి సోనాలి బింద్రే కాన్సర్ గురించి ఎలా చెప్పిందో తెలుసా.? ఎమోషనల్ లెటర్ ట్వీట్.!  

తను హై-గ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని… ట్రీట్‌మెంట్ కోసం న్యూయార్క్ వెళుతున్నానని ట్విటర్ ద్వారా సోనాలి బింద్రే వెల్లడించగానే యావత్ భారతదేశం షాక్ అయింది. ఈ వార్త ఆమె అభిమానులకు, సన్నిహితులకు జీర్ణించుకోవడం చాలా కష్టమైంది. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో తనకి క్యాన్సర్ సోకిందని కుమారుడి(రణ్ వీర్ )కి చెప్పేందుకు ఎంత సతమతమయ్యిందో వివరించింది సోనాలి.

“తన కొడుకు 12 సంవత్సరాలుగా నా మంచి చెడులకు జవాబుదారీగా ఉన్నాడని.. వాడు పుట్టినప్పటి నుంచి నేను, నా భర్త గోల్డి బెహల్ వాడి సంతోషం, శ్రేయస్సే లక్ష్యంగా ఏ పనైనా చేశామని తెలిపారు. నాకు ఈ వ్యాధి గురించి తెలిసినప్పటి నుంచి వాడికి ఈ విషయాన్ని ఎలా చెప్పాలనే డైలమాలో మేము పడిపోయామన్నారు. వాడిని కాపాడుకోవాలంటే నిజాలన్నీ చెప్పటం ముఖ్యం. మేము ఎప్పుడు వాడి దగ్గర నిజాయితీగా ఓపెన్‌ గా ఉండాలి. సో చెప్పేశాం అన్నారు.

చాలా మెచ్యూర్ గా సమస్యని అర్దం చేసుకొని అప్పటి నుండి నాకు ధైర్యం, బలాన్ని ఇచ్చాడు. కొన్ని సందర్భాలలో వాడే అన్నీ అయి నన్ను చూసుకుంటున్నాడు.

ఇలాంటి సమస్యలని పిల్లలతో పంచుకోవడం ముఖ్యమని నేను భావిస్తాను. వారిని నొప్పించడమెందుకులే అని చెప్పకుండా ఊరుకోవడం కంటే విషయాన్ని వారికి చెప్పి, ఎక్కువ సమయం వారితో గడపడం ముఖ్యం. రణ్ వీర్ తో ప్రస్తుతం ఆనంద సమయం గడుపుతున్నాను. సమ్మర్ వెకేషన్ వలన వాడు నాతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అతని తుంటరి చేష్టలు నాలో ఎంతబలాన్ని నింపినట్టు అనిపిస్తుందని సోనాలి తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ హృదయానికి హత్తుకునే ట్వీట్ చేసింది.