నాన్నని మద్యం మాన్పించాలి కొడుకు “ఆత్మహత్య”..     2018-05-02   23:03:23  IST  Raghu V

ఒక కుర్రాడు తన తండ్రిని మద్యం బానిసత్వం నుంచీ బయటకి తీసుకురావాలని ప్రయత్నించాడు..చివరకి ఏమి చేయాలో తెలియక తనువు చాలించాడు..తన చావుతో అయినా సరే తన తండ్రి మద్యం మానేస్తాడు అని ఓ పిచ్చి ఆలోచన తన ఎన్నో ఏళ్ల భవిష్యత్తు కలని చిద్రం చేసింది ఆ కుర్రవాడు రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తోంది..వివరాలలోకి వెళ్తే..

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా గురుకుల్‌పట్టి చెందిన మాడసామి, ఈశాకి అమ్మాళ్‌ కుమారుడు ఉన్నాడు అతని పేరు దినేశ్‌ నల్లశివన్‌ (17). ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన దినేశ్ నీట్ పరీక్ష కోసం సిద్దమవుతున్నాడు. 9ఏళ్ల క్రితమే తల్లి మరణించడంతో అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. తండ్రి తాగుడుకు బానిసయ్యాడు.. రోజూ ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవడం మాడసామికి నిత్యకృత్యం అయిపోయింది…ఈ క్రమంలోనే

తన తండ్రి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అయితే అప్పటికీ తన తండ్రి వ్యవహారంలో మార్పు రాలేదు తన అప్పటికే తన తల్లిని కోల్పోయిన దినేశ్ తండ్రి ఇలా అయిపోవడం భరించలేక పోయాడు ఎలా అయినా సరే తాగుడు కి తన తండ్రిని దూరం చేయాలని అనుకున్నాడు ఒక లేఖని రాసి ఆత్మహత్యకి పాల్పడ్డాడు..ఇప్పుడు అతడు రాసిన లేఖ అందరిని కంటతడి పెట్టిస్తోంది..