అతను సాఫ్ట్వేర్ ఉద్యోగి..మంచి జీతం.! సూసైడ్ కి ముందు రాసిన ఈ లెటర్ చూస్తే కన్నీళ్లొస్తాయి!     2018-06-08   23:59:24  IST  Raghu V

నేడు ఆత్మహత్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ధైర్యంగా ఉండాల్సిన యువత చిన్న చిన్న విషయాలకు ఒత్తిడి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు. భాగ్యనగరంలో విషాధ ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్, మంచి జీతం ఉండి కూడా ప్రేమ విఫలం అయ్యింది అంటూ దారుణంగా ప్రాణాలు తీసుకున్న ఘటన బండ్లగూడలో జరిగింది. ఈ యువకుడి తల్లిదండ్రుల ఆవేదన చూసేవారికి సైతం కన్నీళ్లు తెప్పించాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ బండ్లగూడకి చెందిన యతీష్.. విప్రో కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మంచి జీతం.

నాలుగేళ్లుగా ఓ అమ్మాయి ప్రేమలో ఉన్నాడు. ఇంట్లో వారికి కూడా చెప్పాడు. పెళ్లికి యతీష్ కుటుంబం కూడా ఓకే అన్నది. అయితే రెండు నెలల క్రితం అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఈ విషయంపై నిలదీశాడు. పెళ్లికి ఇంట్లో వారు ఒప్పుకోవటం లేదని చెప్పింది ఆ అమ్మాయి. ఇంట్లో వారు చూపించిన సంబంధమే చేసుకుంటానని.. నా పెళ్లి నా చేతుల్లో లేదని చెప్పింది. అయితే నెల రోజుల క్రితం మరోసారి వీళ్లిద్దరూ మరోసారి కలిశారు. మాట్లాడుకున్నారు. ఈ సమయంలో మరో యువకుడి ప్రేమలో ఉన్నట్లు గుర్తించాడు.