Sofia Hayat releases her own love making video

సోఫియా హయత్ అనే సంచలనాత్మక పేరు ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఆమె గురించి చిన్నగా పరిచయం చేస్తాం. బాలివుడ్ లో అడపాదడపా కనిపించిన ఈ మోడల్ సినిమాలు, మోడలిమగ్ వదిలేసి సన్యాసం తీసుకుంది. సన్యాసం తీసుకున్న తరువాత మక్కా, కైలాస పర్వతం, ఇలా మతాల తేడా లేకుండా పుణ్యక్షేత్రాలు తిరిగింది. కొన్నిరోజులు నిజంగానే సన్యాసం తీసుకున్నట్లుగా అనిపించింది. కాని ఇంతలో తాను ఎవరో కాదు పరమశివుడి తల్లినని, శివుడు తన గర్భంలో జన్మించాడాని, ఇది తన కొత్త జన్మ అని బాంబు పేల్చింది. ఆ సంచలనం జనాలు ఇలా మర్చిపోయారో లేదో ఒక మోడల్ లాగా బట్టలు తొడగడం ప్రారంభించింది. ఆ తరువాత ఓ యువకుడిని పెళ్ళి కూడా చేసుకుంది. తన పెళ్ళికి శివుడు, కృష్ణుడు, అల్లా, జీసస్ .. అందరి ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పుకుంది.

ఇప్పుడు కొత్తగా ఏం చేసిందో తెలుసా? తన భర్తతో శృంగారం చేస్తూ, దాన్ని ఏదో సినిమా పాటల చిత్రీకరించుకుంది. వెనకాల “ఓం శాంతి” అంటూ పాట ఒకటి. ఈమె ఒంటి మీద స్వస్తిక్ సింబల్ కూడా టాటూ రూపంలో ఉండటం విశేషం. ఇది చూసిన హిందూ మతసంఘాలు అల్రెడి పోలిస్ స్టేషన్లో కేసులు వేయడం మొదలుపెట్టారు. కాని సోఫియా మాత్రం తన పని తాను చేసుకుంటోంది.


“ఈ వీడియో చెత్తగా అనిపిస్తే అది మనుషుల తప్పు. ప్రేమ, శృంగారం చాలా పవిత్రమైనవి. నిజమైన ప్రేమను వ్యక్తపరిచే అతిపెద్ద మార్గం శృంగారం. సృష్టి నుంచి మనం వచ్చాం, శృంగారమే సృష్టి. ఈ విషయాన్ని మనుషులు అర్థం చేసుకోకపోవడం వలనే మానభంగాలు జరుగుతున్నాయి. పోర్న్ వలన మగవారు కూడా చెడిపోయారు. శృంగారంలో స్త్రీని ఓ ఆటవస్తువులా చూస్తున్నారు. కాని ఇద్దరు భాగస్వాములు సమానంగా ప్రేమను వ్యక్తపరిచే పవిత్ర కార్యం శృంగారం” అంటూ వేదాంతం మాట్లాడుతోంది సోఫియా.