దానితో టచ్ లో ఉండటం వల్ల...అసలు "టచ్" మిస్ అవుతున్నారు చాలా మంది.! మరి మీరు?  

సోషల్ మీడియా నేటి తరం రొమాంటిక్ రిలేషన్‌షిప్‌పై ప్రభావం చూపుతోందని డాక్టర్ రుత్ చెబుతున్నారు. పక్కనున్న వ్యక్తితో కలవకపోవడం, ఫోన్‌తోనే బిజీగా ఉండటం వల్ల ఒంటరిగా మిగులుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ప్రపంచం పుణ్యామని మనుషుల సామాజిక నైపుణ్యాలు దెబ్బతింటున్నాయని ఆమె వాపోయారు.

‘ఎదుటి వ్యక్తితో మాట్లాడే కళను నేటి తరం కోల్పోతోంది. నిత్యం ఫోన్లతో బిజీగా ఉంటున్నారు. రెస్టారెంట్‌కు జంటగా వెళ్లినప్పుడు కూడా పార్టనర్‌తో సరదాగా గడపాల్సింది పోయి ఫోన్లతో గడిపేస్తున్నారు. ఇది రిలేషన్‌షిప్స్‌లో అతిపెద్ద సమస్య. కాబట్టి సాధ్యమైనంత తక్కువ సమయం ఇంటర్నెట్‌తో వాడండ’ని ఆమె సూచిస్తున్నారు. ఇలా ఒంటరిగా గడపడం వల్ల మానసిక సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.