గురక సమస్యకి తిరుగులేని వైద్యం  

భర్త గురక పెడుతుంటే భార్య నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉండే సందర్భాలు ప్రతీ ఇంట్లో రాత్రిపూట జరుగుతూనే ఉంటాయి.. ఆడవారు కూడా ఇలా గురకపెట్టడం సహజమే.ఐతే గురక పెడుతూ చాలా మంది నోరు తెరిచి ఉంచడం,వెల్లకిలా పడుకుని గురక పెట్టడం ఇలా చేసేవాళ్ళకి ఆరోగ్య సమస్యలు కలుగుతాయట.

గురక సమస్య నుంచి దూరం కావాలంటే.. అర టీ స్పూన్‌ యాలకుల పొడిని గ్లాసు వేడి నీటిలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది. రెండు స్పూన్ల పసుపు పొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక తగ్గుతుంది. ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడి చేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో పోసి పీల్చుతుంటే తగ్గుతుంది.

అర స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, అర టీ స్పూన్‌ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది.అలాగే గురక వస్తున్నవాళ్ళు తప్పకుండా యోగా చేస్తే ఫలితం ఉంటుందట…బ్రీథింగ్ వ్యాయామాలు రోజు క్రమం తప్పకుండా చేస్తే సత్ఫలితాలను ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.