skipping for weight loss

ఈ రోజుల్లో బిజీ జీవనశైలి కారణంగా వాకింగ్,రన్నింగ్ చేయటానికి జిమ్ కి వెళ్ళటానికి సమయం ఉండటం లేదు. ముఖ్యంగా ఆడవారికి వారి పనుల కారణంగా కుదరదు. ఆడవారికి ప్రధానంగా పొట్ట మరియు పొట్ట కింద భాగాలలో కొవ్వు అధికంగా చేరుతుంది. ఈ కొవ్వు తగ్గాలంటే వాకింగ్ చేయటం లేదా జిమ్ కి వెళ్లి 40 నిమిషాల పాటు వ్యాయామం చేయవలసి ఉంటుంది.

కానీ అంత సమయం మరియు తీరిక ఎవరికి ఉండదు. అందువల్ల ఇంటిలోనే సులభంగా 10 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే సరి. 40 నిమిషాల వ్యాయామంతో సమానం. స్కిప్పింగ్ అనేది బయటకు వెళ్లకుండా ఇంటిలో చేసుకొనే వ్యాయామం.

ప్రతి రోజు 10 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే పొట్ట కింద భాగం, పిరుదులు, తొడ భాగంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. అయితే ప్రారంభంలో 5 నిమిషాల ప్రారంభించి నిదానంగా 10 నిమిషాలకు పెంచాలి. అలాగే రోజు రోజుకి వేగం కూడా పెంచాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే రెండు వారాల్లో బరువు తగ్గిపోతారు. అయితే మోకాళ్ళ నడుము నొప్పి ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే చేయాలి.

దీనివలన కలిగే లాభాలు

గుండెలో చెడు కొలస్ట్రాల్ ని కరిగిస్తుంది.
రక్త ప్రసరణను పెంచటంలో బాగా సహాయపడుతుంది.
ఎముకలలో క్యాల్షియం నిల్వ ఉండేలా చేస్తుంది. దాంతో ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉంటే శరీరంలోని అనేక కదలికలు మరియు పనితీరు బాగుంటుంది.