శివునికి చెల్లెలు ఉందని మీకు తెలుసా ?     2018-05-23   01:18:45  IST  Raghu V

త్రిమూర్తులలో ఒకరైన శివుడు సృష్టి, స్థితి, ల‌య కార‌కుల్లో చివరి వారు. లయ అంటే అన్నింటిని ఆయనలో కలుపుకుంటారు. అందుకే ఆయనకు లయకారకుడు అని పిలుస్తారు. అలాగే ఆయనను బోళా శంకరుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అయన భక్తులు కోరిన కోరికలను వెంటనే ఇచ్చేస్తారు. అందులో భాగంగానే పురాణాల్లో చాలా మంది తపస్సు చేసి వరాలను పొందారు. ఇక విషయంలోకి వెళ్ళితే… శివునికి ఒక చెల్లి ఉంది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు.

శివుని చెల్లెలి పేరు దేవీ అశావ‌రి. ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు పార్వ‌తిని పెళ్లి చేసుకుని కైలాసానికి వ‌చ్చాక అక్క‌డ ఆమె కాపురం పెట్టింది. అయితే అక్కడ ఆడవారు ఎవరు ఉండరు. అందరూ మగవారే ఉంటారు. కైలాసంలో పార్వతికి ఎవరైనా మహిళ తోడుగా ఉంటే బాగుటుందని పార్వతి శివుణ్ణి అడగగా…. శివుడు త‌న‌లాగే ఉండే దేవీ అశావ‌రిని సృష్టించాడు. దేవీ అశావ‌రి శివుడిలాగే పులి చ‌ర్మం ధ‌రించి ఉంటుంది. జుట్టు విరబోసుకుని ఉంటుంది. కాళ్లు ప‌గిలి ఉంటాయి. అయిన‌ప్పటికీ పార్వ‌తి సంతోషించి అశావ‌రిని ఇంటికి తీసుకెళ్తుంది.