Singer Suchitra got kidnapped for leaking nudes?

సింగర్ సుచిత్ర గురించి వినే ఉంటారుగా ? అయినా అదేం ప్రశ్న. సుచీ లీక్స్ వ్యవహారం తెలియని దక్షిణ భారతీయుడు ఉండడు కదా. తమిళ ఇండస్ట్రీ గురించి ఒక్కసారిగా ట్విట్టర్ లో నగ్న సత్యాలు బయటపెట్టడం మొదలుపెట్టింది సుచీ. నగ్న సత్యాలతో పాటు నగ్న వీడియోలు, నగ్న చిత్రాలు కూడా బయటపెట్టడంతో దేశవ్యాప్తంగా సుచీ లీక్స్ ఓ సంచలనం అయ్యింది. హన్సిక లాంటి పాపులర్ హీరోయిన్ తో పాటు, సంచిత శెట్టి, అనూయ లాంటి యంగ్ హీరోయిన్ల నగ్న దృశ్యాలు బయటపెట్టిన సుచీ, ఆ తరువాత ధనుష్, అమలాపాల్, అనిరుధ్, అండ్రియాలకి సంబంధించిన నగ్న దృశ్యాలు బయటపెట్టబోయింది. ఇంతలోనే సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ డిలీట్ అయ్యింది.

అమే భర్త సుచిత్రకి పిచ్చిపట్టింది అని అంటుంటే, సుచిత్రకి పిచ్చి లేదు ఏమి లేదు, తనకి అన్యాయం చేసినవారి మీద పగ తీర్చుకుంటోంది అని సినీజనాలు అన్నారు. తాజాగా, తెలుగు గాయని గీతామాధురి కూడా సుచిత్రకి పిచ్చి లేదని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే, ఇప్పుడు సుచిత్ర ఎక్కడుందో ఎవరికి తెలియట్లేదు.

ఆమె ట్విట్టర్ లో లేదు. సినిమావాళ్ళకి ఎక్కడా కనబడట్లేదట. ఇంతమంది నగ్నచిత్రాలు లీక్ చేసిన సుచిత్ర మీద ఎలాంటి కేసు నమోదు అవలేదు. ఎందుకు? ఆమెకి అన్యాయం జరిగింది కాబట్టే, ఆమె మీద కేసు వేస్తే నిజాలు బయటపడతాయి కాబట్టే అంత సైలెంట్ గా ఉన్నారా? ఇంతకి సుచిత్ర ఎక్కడ ఉన్నట్లు ఇప్పుడు?

చెన్నైలో అయితే ఆమె కిడ్నాప్ కి గురైంది అని అంటున్నారు. ఎవరో సినిమా పెద్ద మనిషే ఈ పని చేయించాడని అంటున్నారు? సుచిత్రని ఎవరు కిడ్నాప్ చేసుంటారు? ధనుష్, అనిరుధ్, హన్సికలలో ఒకరా? లేదంటే సంచితానా? లేదంటే అమలాపాల్ ఈ పని చేసి ఉంటుందా?