దంతాలు తెల్లగా మెరవాలంటే సహజమైన ఇంటి చిట్కాలు

దంతాలు పసుపుపచ్చగా మారాయని బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో దంతాలను తెల్లగా మెరిసేలా చేయవచ్చు. దంతాలు పాలిపోవటం అనేది వృద్ధాప్య ప్రక్రియలో ఒక బాగం. అయితే దంతాల మీద మరకలు,పాలిపోవటం వంటి సమస్యలకు సులభమైన ఇంటి పరిష్కారాలు ఉన్నాయి. వంద డాలర్ల బ్లీచింగ్ ట్రేలు, దంతవైద్యుడి దగ్గరకు వెళ్ళటం మరియు తెలియని రసాయన సొల్యూషన్స్ వంటివి వాడకుండా కేవలం ఇంటిలో సులభంగా దొరికే వస్తువులతో దంతాలను తెల్లగా మెరిసేలా చేయవచ్చు.

1. స్ట్రాబెర్రీలు తినాలి
స్ట్రాబెర్రీలలో మాలిక్ ఆమ్లం అనే ఎంజైము మరియు విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన దంతాలు తెల్లగా మారటానికి సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలలో కనిపించే ఆస్ట్రిజెంట్ దంతాల ఉపరితల మరకలను తొలగించడానికి సహాయపడుతుంది. స్ట్రాబెర్రీ పేస్ట్ ని ఉపయోగించి వారంలో ఒకసారి లేదా రెండుసార్లు దంతాలను తోముకుంటే మంచి పలితాలు కనపడతాయి. ఒకవేళ స్ట్రాబెర్రీలను తింటే కనుక బాగా నమిలి తినాలి.