“సిలికాన్ ఆంధ్రా” మనబడి “తెలుగు పరీక్షలు”     2018-05-15   04:24:09  IST  Bhanu C

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ఎన్నారై ల పిలలకి తెలుగు బాష ని నేర్పడానికి..తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేయడానికి సిలికాన ఆంధ్రా వారు చేసే కార్యక్రమాలు ఎంతో మంచి ఫలితాలని ఇస్తున్నాయి అయితే ఈ క్రమంలో సిలికాన్ ఆంధ్రా మన బడి ద్వారా తెలుగు బాషా సర్టిఫికెట్‌ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు ఈ నెల 12న పరీక్ష నిర్విహించారు.

అయితే పరీక్షలని నిర్వహించిన 2017-18 విద్యా సంవత్సారానికి గాను 1933 మంది విద్యార్థులు, ప్రపంచ వ్యాప్తంగా 58 కేంద్రాల్లో పరీక్షలు రాశారు…అయితే ఈ విద్యార్ధులలో 1400 మంది జూనియర్‌, 533 మంది సీనియర్‌ సర్టిఫికెట్‌ కోసం పరీక్షలు రాశారు…ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ అలేఖ్య పుంజల మాట్లాడుతూ.. ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్నా పిల్లలకు తెలుగు భాష నేర్పించటానికి కృషి చేస్తున్న పిల్లల తల్లి తండ్రులకి కృతజ్ఞతలు తెలిపారు .