కిడ్నిలు ప్రమాదంలో ఉంటే ఎలా గుర్తించాలి?     2018-04-04   23:39:12  IST  Lakshmi P

గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్ లానే, కిడ్ని సమస్యలు కూడా లక్షలకొద్దీ ప్రాణాలు తీసుకుపోతున్నాయి ప్రతీ ఏడాది. చిన్ని చిన్ని అజాగ్రత్తల వలన కూడా మన కిడ్నీలు దెబ్బతింటాయి. సమస్య మొదట్లో ఉన్నప్పుడే గుర్తిస్తే మంచిది. అలా కాకుండా ఆలస్యం జరిగితే, చికిత్స కూడా ఆలస్యంగా జరుగుతుంది. దాంతో మొక్కలా ఉన్నప్పుడే సులువుగా వంచాల్సినదాన్ని మానుగా మారాగా పట్టికోని తంటాలు పడాల్సి వస్తుంది. అలా జరగకూడదు అంటే మన కిడ్నీల్లో సమస్యలను ఆదిలోనే గుర్తించాలి. అదే ఎలా అని అంటారా ?

* మూత్రంలో రక్తం వస్తే ఖచ్చితంగా మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే. రక్తం మూత్రం ద్వారా బయటకి వస్తే, కిడ్నీలు ఇంఫెక్షన్ కి గురి అయినట్టు. ముఖ్యంగా జ్వరం సమయంలో ఇలా జరగవచ్చు. నొప్పి కూడా ఉంటే అలర్ట్ అయిపోండి. అయితే స్త్రీలు పీరియడ్స్ సమయంలో ఇలాంటి సమస్య ఎదుర్కోంటే అతిగా భయపడకుండా ముందుగా డాక్టర్ ని సంప్రదించాలి.

* మూత్రం మాటిమాటికి వచ్చినా జాగ్రత్తపడండి. కిడ్నీలు సరిగా పనిచేయకపోగడం వలన కూడా ఇలా జరగవచ్చు.

* పురుషుల్లో అంగస్తంభనలు తగ్గడం, సెక్స్ మీద ఆసక్తి తగ్గడానికి కుడా ప్రమాదంలో ఉన్న కిడ్నీలు కారణయ్యే అవకాశం లేకపోలేదు.

* నిద్రలేమి సమస్యలకు కూడా పాడవుతున్న కిడ్నీలు కారణం కావచ్చు. రాత్రుల్లో మూత్రవిసర్జన అతిగా చేయాల్సిరావడం, నొప్పిగా అనిపించడం సూచికలే.

* చేతులు కాళ్ళు ఉబ్బడం కూడా ఓ సూచిక. కిడ్నీలు సోడియం సరిగా ఫిల్టర్ చేయలేకపోతే ఇలా జరగవచ్చు.

* కిడ్నిలు సరిగా పనిచేయకపోతే టాక్సిన్స్ సరిగా బయటకిపోవు. రక్తంలో టాక్సిన్స్ ఉండిపోవడం వలన, బలహీనంగా తయారవుతారు. ఊరికే అలసిపోవటం, ఏ పని సరిగా చేయలేకపోవటం లాంటివి కిడ్నీ ఫేల్యూర్ కి సూచిక.

* కిడ్నిలు సరిగా పనిచేయక రక్తంలో యూరియా ఎక్కువగా చేరిపోతుంది. దాంతో దురద అసాధారణంగా వేస్తుంది. ఇలాంటి సమయంలో కూడా పరీక్షలు చేయించుకోని జాగ్రత్తపడాలి.