Significance of mangala sutra and the black, red and white beads in Hindu marriage?

మన హిందూ సాంప్రదాయంలో మంగసూత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఆచారం సుమారుగా 1500 సంవత్సరాల క్రితం నుండి ఉంది. మంగళసూత్రం అనే పధం సంస్కృత పదం. మంగళ అంటే శుభప్రధం, సూత్రం అంటే తాడు అని అర్ధం. మంగలసూత్రాన్ని 108 దారపు పోగులతో పసుపు కలిపి తయారుచేస్తారు. ఈ మంగళ సూత్రాన్ని పెళ్లి సమయంలోనే కడతారు. స్త్రీలు ఈ సూత్రంలో ముత్యాలు, పగడలు వేసుకొని ధరిస్తారు.

సనాతన శాస్త్రాల ప్రకారం మంగళసూత్రం స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్మకం.

మంగళ సూత్రంలోని పగడం సూర్యునికి ప్రతీక. పగడం ఉత్తేజాన్ని కలిగించటమే కాకుండా నాడీ మండలాన్ని చురుకుగా ఉంచుతుంది.

మంగళ సూత్రంలో ఉండే ముత్యం చంద్రునికి ప్రతీక. ముత్యం శరీరంలో వేడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది.

మంగళ సూత్రం అనేది భార్య భర్తల అనుబండానికి గుర్తు. ఇది జీవితంలో వచ్చే కీడులను తొలగిస్తుందని నమ్మకం.

స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువుల నమ్మకం. అందుకే హిందూ మహిళలు మంగళ సూత్రాన్ని తప్పకుండా ధరిస్తారు.