రచయితగా హాట్‌ హీరోయిన్‌     2015-02-05   02:27:31  IST  Raghu V

Shruti Hassan Turns Script Writer?

శృతిహాసన్‌ హీరోయిన్‌గా ప్రస్తుతం తెలుగు, తమిళం మరియు హిందీల్లో వరుస చిత్రాలతో దూసుకు పోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ అమ్మడు సంగీత దర్శకురాలిగా కూడా తన ట్యాలెంట్‌ను చూపించింది. ఇక సింగర్‌గా ఇప్పటికే పలు పాటలు పాడి మెప్పించింది. ఈమె త్వరలో రచయితగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్నప్పటి నుండే కథలు రాసే అలవాటున్న శృతిహాసన్‌ త్వరలోనే సినిమాలకు స్క్రిప్ట్‌ రైటర్‌గా మారే అవకాశముంది. శృతిహాసన్‌ను ఆమె తండ్రి కమల్‌ రచయితగా ప్రోత్సహిస్తున్నాడు.

తాజాగా శృతిహాసన్‌ పుట్టిన రోజు సందర్బంగా స్క్రిప్ట్‌ రైటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను కమల్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడట. దాంతో తనను నాన్న స్క్రిప్ట్‌ రైటర్‌గా బాగా ప్రోత్సహిస్తున్నాడని, ఆయన ప్రోత్సాహంతో స్క్రిప్ట్‌ రైటర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని కోరికగా ఉందని చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న శృతిహాసన్‌ కొంత కాలం తర్వాత స్క్రిప్ట్‌ రైటర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం తెలుగులో ఈమె మహేష్‌బాబు సరసన ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. అటు తమిళం మరియు హిందీల్లో కూడా ఈమె వరుస చిత్రాల్లో నటిస్తూనే ఉంది.