మరింతగా రెచ్చి పోయింది     2015-09-01   01:29:04  IST  Raghu V

Shruti Haasan Over Exposing in Welcome Back Movie

హీరోయిన్‌ శృతిహాసన్‌ సినిమా సినిమాకు తన గ్లామర్‌ డోస్‌ను పెంచుతూనే ఉంది. అవసరం ఉన్నా లేకున్నా కూడా ఈ అమ్మడు తన అందాలను విందు చేస్తూనే ఉంది. తాజాగా ఈమె నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘వెల్‌కం బ్యాక్‌’లో మరింత హాట్‌ హాట్‌గా కనిపించబోతున్నట్లుగా తాజాగా విడుదలైన వీడియో సాంగ్‌ను చూస్తుంటే తెలుస్తోంది. మొదటి సినిమాలోనే బికినీ వేసిన ఈ అమ్మడు అందాల ఆరబోతలో ఏమాత్రం వెనకాడటం లేదు.

తెలుగులో తాజాగా ‘శ్రీమంతుడు’ సినిమాలో నటించిన ఈ అమ్మడు పాటల్లో మినహా సన్నివేశాల్లో పద్దతిగా కనిపించింది. ఒకటి రెండు పాటల్లో తన హాట్‌ లుక్‌తో అదర గొట్టింది. ఇక ఈమె త్వరలోనే తమిళంలో విజయ్‌తో కలిసి నటించిన ‘పులి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాలున్న పులి సినిమా తర్వాత ఈమెకు తమిళంలో మరింత క్రేజ్‌ పెరగడం ఖాయం అంటున్నారు. తమిళంలో ఈమె గ్లామర్‌ను కాస్త ఎక్కువగానే ఆరబోసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. స్టార్‌ హీరో కమల్‌ కూతురును అనే విషయాన్ని మర్చి పోయి ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తుంటే ఆయన ఫ్యాన్స్‌ మాత్రం కాస్త చిన్న బుచ్చుకుంటున్నారు.