“చంద్రబాబు” కి షాక్ ఇవ్వనున్న “ఏపీ మంత్రి” ..ఆ “సర్వే ఎఫ్ఫెక్టే” నా  

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సర్వేల హడావిడి మామూలుగా ఉండదు..అన్ని రాష్ట్రాలో ఈ హడావిడి ఉంటూనే ఉంటుంది అయితే ఎప్పుడు సహజంగా జరిగే సర్వేలు ఆయా పార్టీల అధినేతలు చేయించడం వలన గానీ..లేదా కేంద్రం చేయించడం వలన కానీ లేకపోతే ప్రముఖ మీడియా చానెల్స్ వాళ్ళు చేస్తుంటారు..అప్పుడప్పుడు కొన్ని సంస్థలు కూడా ఈ సర్వేలు చేపడుతుంటాయి..అయితే తమ తమ పార్టీలో ఉండే నేతలు పక్క పార్టీలలోజంప్ అయిపోతారు అనే ఇంటిలిజెన్స్ రిపోర్ట్ పార్టీ అధినేతలకి ముందుగానే అందిన సమయంలో ఎదో ఒక సర్వే ఆ పార్టీకి అనుకూలంగా వచ్చేస్తుంది దాంతో జంపింగ్ లకి అడ్డుకట్ట వేస్తుంటారు.

ప్రతీ ప్రభుత్వం తమ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారో సర్వేలు చేయిస్తూ ఉంటాయి..ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందు ఉంటారు..అయితే తాడిని తన్నే వాడు ఉంటే దాని తల తన్నే వాడు ఉంటాడు అంటారు.. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..ఏపీలో నాయకులు ఇప్పుడు సొంతగా సర్వేలు చేయించుకుంటున్నారట..షాక్ అయ్యారా ? నిజమేనండి ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది.ఇది కొత్త విషయం కాకపోయినా ఏపీలో మాత్రం ఇది కొత్తగానే ఉంటంది..ఎందుకంటే ఈ తరహా సర్వేలు ఎప్పుడు ఎవరూ చేయించలేదు కూడా..