నోట్ల రద్దు పై వెలుగు చూసిన మోడీ మోసం..ఇంత దారుణమా మోడీ     2018-05-16   06:32:50  IST  Bhanu C

నల్లధనం పై ఉక్కుపాదం మోపుతానని చెప్పిన నరేంద్ర మోడీ నోట్ల రద్దు విషయంపై రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం ఎంత సంచలనం సృష్టించిందో వేరే చెప్పవలసిన అవసరం లేదు..యావత్ ఆర్ధిక వ్యవస్థపై బడుగు వర్గాలపై మోడీ నిర్ణయం ఎంత్ ప్రభావం చూపించింది..ఇప్పటికీ మోడీ ని ఎంతో మంది చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఒక రకంగా చెప్పలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపి రాదు దానికి కారణం మోడీ విధానాలే, నిర్ణయాలేనని మేధావులు సైతం విశ్లేషిస్తున్నారు..అయితే నోట్ల అడ్డు విషయంలో ఇప్పుడిప్పుడే కొన్ని కీలక మైన ఆధారాలు బయటపడుతున్నాయి..అదేంటంటే.

అమెరికా చెప్పు చేతల్లో బందీలుగా మారి..ఆ దేశం చేసే కుట్రల్ని తెలుసుకోలేక..మన భారత ఆర్ధిక వ్యవస్థ గుట్టు మొత్తం వారి చేతుల్లో పెట్టేందుకే… నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు అంతర్జాతీయగా సంచలనం సృష్టిస్తున్నాయి…ఏషియన్ పసిఫిక్ రిసెర్చ్ అనే సంస్థ నోట్ల రద్దు వెనుక ఎవరి ప్రమేయం ఉంది..ఎవరికి లాభం కలుగుతుందో.. సాక్ష్యాలతో సహా బయటపెట్టింది. ప్రపంచ ఆర్థిక రంగాన్ని అమెరికా తన ఆధీనంలో తెచ్చుకోవడానికి వేసిన ఎత్తులో భారత్ చిక్కుకుంది అనడానికి రుజువు ఇదే.