Shock To Congress Party Senior Leader Bhatti Vikramarka To Join TRS

తెలంగాణ కాంగ్రెస్‌లో తాను ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా గుర్తింపు లేక‌పోవ‌డంతో పాటు ఇక్క‌డ ఓకే సామాజిక‌వ‌ర్గం ఆధిప‌త్యం ఎక్కువ‌వ్వ‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నారు. అటు టీఆర్ఎస్ నుంచి రెడ్‌కార్పెట్ ఉండ‌డంతో ఆయ‌న ఆ పార్టీలోకి జంప్ చేసేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక కేసీఆర్ ఇటీవ‌ల జ‌రిపిన రెండు సర్వేల్లోను మ‌ధిర‌లో భ‌ట్టి విక్ర‌మార్క మ‌ళ్లీ గెలుస్తాడ‌ని తేలింది.

కేసీఆర్ స‌ర్వేలో కాంగ్రెస్ నుంచి భ‌ట్టి విక్ర‌మార్కతో పాటు క‌ల్వ‌కుర్తి ఎమ్మెల్యే వంశీ చంద‌ర్‌రెడ్డి మాత్ర‌మే మ‌ళ్లీ గెలుస్తార‌ని తేలింది. ఇక ఖ‌మ్మం జిల్లాలో బ‌లంగా విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోన్న టీఆర్ఎస్ ఈ క్ర‌మంలోనే భ‌ట్టిని త‌మ పార్టీలో చేర్చుకోవాల‌ని ప్లాన్ చేసి స‌క్సెస్ అయిన‌ట్టు తెలుస్తోంది. భ‌ట్టి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేస్తే ఆ పార్టీకి తెలంగాణ‌లో తీర‌ని లోటే అని చెప్పాలి.