శివాలయంలో శివుని దర్శనం అయ్యాక ఈ తప్పు అసలు చేయకూడదు....ఏమిటో తెలుసా? Devotional Bhakthi Songs Programs     2018-03-19   00:07:29  IST  Raghu V

Shiva Darshan Details

ఏ గుడికి వెళ్లిన కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. శివారాధన అనేది మోక్షానికి మార్గం. అలాంటి శివుణ్ణి దర్శించుకోవటానికి శివాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తలస్నానము చేసి శుభ్రమైన బట్టలను ధరించి నుదుటిన విభూది పెట్టి,మెడలో రుద్రాక్ష మల ధరించి వెళ్ళాలి.

అలాగే పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ, కర్పూరం వంటి వాటిని తీసుకువెళ్లాలి. గోపుర దర్శనం కాగానే మౌనంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి. మనసులో పంచాక్షరిని జపిస్తూ ఉండాలి.వినాయకుని దర్శించి వినాయక స్తుతి చెప్పి గుంజీళ్ళు తీస్తూ నమస్కరించవలెను.బలిపీఠం, నందిల మధ్య నమస్కరించవలెను.

లోపల మూలస్థానంలో ఉన్న స్వామికి నమస్కరించాలి. అలాగే చుట్టూ ఉన్న ఉత్సవ మూర్తులు, నందీశ్వరుడులకు కూడా నమస్కారం చేయాలి. శివాలయంలో తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేయాలి. విభూతిని పెట్టుకోవాలి. ఆలయ దర్శనం సమయంలో శివుని స్త్రోత్రాలు చదువుకోవాలి.

శివుని దర్శనం అయ్యాక ధ్వజ స్థంభం దగ్గర సాష్టాంగనమస్కారం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. మొదట ధ్వజ స్థంభంను దర్శనం చేసుకోవాలి. కానీ శివుని దర్శనం తర్వాత నమస్కరిస్తే పుణ్య ఫలం రాదు. కోరిన కోరికలు నెరవేరవు. కాబట్టి ఈ విషయాన్నీ బాగా గుర్తుంచుకోవాలి.