She will be his heroine .. only if she goes nude

అతనొక సీనియర్ డైరెక్టర్. అతని భార్య ఒక సీనియర్ హీరోయిన్. మామూలుగానే తన సినిమాల్లో హీరోయిన్లతో హద్దు అదుపు దాటి గ్లామర్ పండించడం అతని అలవాటు. దాంతో ఇండస్ట్రీలో అతనికి బ్యాడ్ నేమ్ ఉంది. హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటాడు. వారితో టూ మచ్ స్కిన్ షో చేయిస్తాడు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే, తెర మీద అమ్మాయిలు పొట్టి బట్టలు తొడిగేముందు, ఈ డైరెక్టర్ ముందు బట్టలు లేకుండా కనబడాలంట.

అర్థం కాలేదా? తన సినిమాలో హీరోయిన్ గా కనబడాలంటే, ఆ హీరోయిన్ కొలతలు తనకి నచ్చాలంట. అందుకోసం వారిని నగ్నంగా కనబడమంటాడట. తనకోసం ప్రైవేటుగా న్యూడ్ షో చేస్తేనే, హీరోయిన్ గా అవకాశం దక్కుతుంది. లేదంటే లేదు.

మరో విషయం ఏమిటంటే, ఉత్తరాది నుంచి వచ్చి, తెలుగులో కూడా వెలుగు వెలిగిన ఓ హీరోయిన్ అంటే ఈ డైరెక్టర్ కి స్పెషల్‌ ఇంటరెస్ట్. ఆ హీరోయిన్ తో ఈ దర్శకుడికి అలాంటి ఎఫైర్ కూడా ఉందని టాక్.

ఇక ముందు చెప్పినట్టు, ఈ దర్శకుడి భార్య ఒక సీనియర్ హీరోయిన్. ఆవిడ ఒకప్పుడు ముఖానికి మేకప్ వేసుకున్నదే. మరి ఆవిడకి తన భర్త చేస్తున్న శృంగారలీలలు, హీరోయిన్లతో నగ్నంగా వేయిస్తున్న నృత్యాలు తెలుసో లేదో! తెలిస్తే ఏమవుతుందో !