She is the best kisser in Bollywood

తెలుగు సినిమాల్లో హీరో ఫైట్ చేయడం, హీరోయిన్ నడుము చూపించడం ఎంత కామన్ విషయమో, బాలివుడ్ లో హీరో హీరోయిన్లు ముద్దు పెట్టుకోవడం కూడా అంతే కామన్ విషయం. ఒకప్పుడు ఇమ్రాన్ హాష్మి మాత్రమే అలాంటి సన్నివేశాలు ఎక్కువ చేసేవాడు కాబట్టి ముద్దుల హీరో అని ముద్ర పడింది కాని, ఇప్పుడున్న కుర్ర హీరోలంతా అంతే కాబట్టి, ఎవర్ని ముద్దుల హీరో అనాలో అర్థం కావడం లేదు. రణ్వీర్ సింగ్ , వరుణ్ ధావన్ .. అందరు తమ ప్రతి సినిమాల్లో కొన్ని ముద్దు సన్నివేశాలు చేస్తున్నారు. హీరోయిన్లు కూడా ఎవరు ఈ సీన్లకి అడ్డు చెప్పడం లేదు. దాంతో కిస్సింగ్ అనేది సర్వసాధారణం అయిపొయింది.

రణ్వీర్ సింగ్ గత ఏడాది వచ్చిన “బెఫిక్రే” సినిమాలో హీరోయిన్ వాణి కపూర్ తో 20 కి పైగా ముద్దు సన్నివేశాలు చేసాడు. 20 కి పైగా కిస్సింగ్ సీన్స్ ఒకే ఒక్క సినిమాలో. అనుష్క శర్మ, దీపిక పడుకోనే, పరిణీతి చోప్రా ఇలా టాప్ హీరోయిన్స్ ఆధరాలని చాలాసార్లు చుంబించాడు రణబీర్ సింగ్ . అయితే ఈ హీరోయిన్స్ లో అందరికంటే బాగా ముద్దు పెట్టె హీరోయిన్ ఎవరు ? ఎవరు కిస్సింగ్ లో నేర్పరి ? ఎవరిని కిస్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ? అంటూ ప్రశ్నలు అడిగేశారు రణ్వీర్ ని. అప్పుడు ఈ కండల హీరో నిమిషం కూడా ఆలోచించకుండా దీపిక పేరు చెప్పేసాడు. తనతో నటించిన హీరోయిన్స్ అందరిలోకి దీపిక బెస్ట్ కిస్సర్ అంట. తనని కిస్ చేయడం బాగా ఎంజాయ్ చేసానని చెప్పాడు రణ్వీర్.

వాణి కపూర్ తో రికార్డు స్థాయి కిస్సింగ్ సీన్స్ చేసినా, రణ్వీర్ దీపిక పేరు చెప్పడం పెద్దగా ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే దీపిక రణబీర్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. మొహమాటం కొద్ది ప్రేయసి పేరు చెప్పాడో, దీపిక పేరు చెప్పకపోతే ఎక్కడ గొడవలు అవుతాయని భయపడ్డాడో కాని ఎలాంటి సంచలన జవాబు ఇవ్వకుండా, సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయి ప్రేయసికే బెస్ట్ కిస్సర్ బిరుదు ఇచ్చేసాడు. “రాం లీల” సినిమాలో రణ్వీర్ – దీపికల మధ్య కిస్సింగ్ సీన్స్ చాలా రొమాంటిక్ గా ఉంటాయి అనుకోండి. కాబట్టి తన జవాబుని పూర్తిగా తీసి పారేయ్యలెం.