మీరు తనని నిజంగా ప్రేమిస్తున్నారో లేదో ... ఆమె ఈరకంగా పరీక్షిస్తుంది    2017-03-11   03:48:37  IST  Raghu V

ఆడవారి మాటలు అర్థం కావు అని అంటారు .. అలాగే మగవారి మాటలు నమ్మడానికి వీలు లేదు అని అంటారు. ఎందుకు అంటే, ఒక అమ్మాయి తనకి దక్కేదాకా ఓ బానిసలా ఉంటారు మగవాడు. ఎన్నో కాకమ్మ కబుర్లు చెబుతాడు .. పూర్తిగా ఆమె మనసుని అర్థం చేసుకున్నట్లుగా ప్రవర్తిస్తాడు .. ఆమె ఒక విషయాన్ని ఒప్పు అంటే ఒప్పు, ఒక విషయాన్ని తప్పు అంటే అది తప్పు .. ఇలానే ఉంటుంది మగవారి ప్రవర్తన. కాని, మగవారు ఇలా నటించడం ఎదో కుట్రతో చేసేది కాదు (కొందరిది కుట్రే అనుకోండి). అమ్మాయి ఎక్కడ దూరం అవుతుందో అనుకోని అణగిమణిగి ఉంటారు. అందుకే, మగవారి ప్రేమకు అసలు పరీక్ష అమ్మాయి దక్కినతరువాతే మొదలవుతుంది. అపుడు ఆమె మీకు తెలియని పరీక్షలు పెట్టవచ్చు .. మీ సమాధానం ఆమెకి అనుకూలంగా లేకపోతే, మీ బంధం చిక్కుల్లో పడినట్టే .. మరి ఆ పరిక్షలు ఏంటో చూడండి.

* మీరు తన పద్ధతుల్ని ఇష్టపడుతున్నారా లేదా టెస్ట్ చేస్తుంది. అంటే, ప్రేమించనప్పుడు లేని తప్పులు, సడెన్ గా ఇప్పుడే అబ్బాయి చూడటం మొదలుపెట్టాడు అనుకోండి, ఆ బంధానికి బీటలు వారుతున్నట్లే. ఒక్కోసారి కావాలని మిమ్మల్ని పరీక్షించవచ్చు .. అమ్మాయి దక్కక ముందు నచ్చిన ప్రవర్తన, పధ్ధతి మీద కొత్తగా విమర్శలు చేస్తే పరీక్షలో ఫెయిల్ అయినట్టే.

* ఒక్కోసారి కావాలని సెక్స్ సెషన్ కి ఒప్పుకోరు అమ్మాయిలు. ఇలా ఎందుకు అంటే, భాగస్వామి సహనాన్ని పరీక్షించడానికి. తనకి నేను కేవలం శారీరకంగానే కావాలా లేక మానసికంగా కూడా నాపై ఇష్టత ఉందా .. ఉంటే అర్థం చేసుకుంటాడు అని అనుకుంటారు. ఆ పరీక్షలో సెక్స్ కోసం మొండికేస్తే కష్టమే. సెక్స్ వద్దంటే మగవారి రియాక్షన్ ఎలా ఉంటందో చూడాలి … ఇదే అనుకుంటారు అమ్మాయిలు.

* నిర్ణయాల దగ్గర చాలా గ్రహిస్తారు అమ్మాయిలు. ఒకే నిర్ణయం తీసుకునే ముందు అబ్బాయి తన సలహా లేదా అభిప్రాయం అడుగుతున్నాడా లేదా, దాన్ని బట్టే అతని మనసులో తనకున్న విలువని లేక్కేసుకుంటారు అమ్మాయిలు .. కాబట్టి ఈ పరీక్షలో నెగ్గాలంటే ఓ నిర్ణయం తీసుకునే ముందు ఆమె అభిప్రాయాన్ని సూచనల్ని తప్పకుండా అడగాలి అబ్బాయిలు … అంత తనదే రాజ్యం అంటే నడవదు.

* ఇది చాలామంది మగవారు గమనించని పరీక్ష. శృంగార సమయంలో, భాగస్వామి నుంచి ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ ఆశిస్తారు అమ్మాయిలు. కాంప్లిమెంట్ ఇవ్వకపోతే, తనని అందగత్తెలా అబ్బాయి ఫీల్ అవడం లేదని అనుకుంటారు. పోగుడుతాడా లేదా అని పరీక్షిస్తారు. కాబట్టి, ఉన్న విషయాన్ని చెప్పడమే మంచిది. శృంగారం తన టెక్నిక్స్ ని కాని, ఆమె శరీరంలో మీకు నచ్చిన భాగాన్ని కాని పొగడాలి. అప్పుడే ఆమెకు సంతృప్తి. ఎందుకంటే అమ్మాయి దొరక్కముందు కవితలు రాసి, ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉంటే ఎలా భరిస్తుంది ?