టెన్షన్‌లో శర్వానంద్‌     2015-02-05   02:38:46  IST  Raghu V

Sharwanand Tens with Malli Malli Idi Rani Roju

‘జర్నీ’ సినిమా తర్వాత తెలుగులో శర్వానంద్‌కు ఒక్క మంచి సినిమా రాలేదు. ‘జర్నీ’ కూడా తమిళ డబ్బింగ్‌ సినిమా అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘జర్నీ’ సినిమా తర్వాత ఈయన నటించిన వరుస చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ‘రన్‌ రాజా రన్‌’ కాస్త పర్వాలేదు అనిపించిన ఆయన స్థాయిని పెంచడంలో విఫలం అయ్యింది. ఇక ఈయన తాజాగా నటించిన చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫలితంపై శర్వానంద్‌ చాలా టెన్షన్‌గా ఉన్నాడు.

ఇప్పటికే వరుస ఫ్లాప్‌లతో ఉన్న తాను మరో ఫ్లాప్‌ పడితే కోలుకోవడం మరింత కష్టం అవుతుందని శర్వా భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నిత్యామీనన్‌తో కలిసి నటించాడు శర్వా. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చాలా ఆలస్యం అయ్యింది. ఇక అనూహ్యంగా విడుదల తేదీని ప్రకటించారు. రేపు ‘గడ్డంగ్యాంగ్‌’ తప్ప మరే సినిమా లేకపోవడంతో ఈ సినిమాను విడుదల చేయాలని భావించినట్లుగా చెప్పుకోవచ్చు. సరైన సమయంలో విడుదల అవుతోన్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. ఈ సినిమా ఫ్లాప్‌ అయితే శర్వానంద్‌ క్రేజ్‌ మరింతగా తగ్గే అవకాశాలున్నాయి.