శని బాధల నుండి విముక్తి పొందాలంటే...ఇలా చేయండి Devotional Bhakthi Songs Programs     2017-10-21   22:16:29  IST  Raghu V

Shani graha dosha nivarana in telugu

తీవ్రమైన శని దోషములతో బాధపడేవారి బాధ వర్ణనాతీతం. ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. ఈ క్రింద తెలిపినవి చేస్తే బాధల నుండి విముక్తి లభించటమే కాకుండా శనిదేవుడు కృప తొందరగా కలుగుతుంది.

ప్రతి ఆదివారమూ సాయంత్రం సమయంలో శమీవృక్షము (జమ్మిచెట్టు) చుట్టూ 18 సార్లు ప్రదక్షణములు చేసి ఆపై ఆ చెట్టు మొదట్లో ఒక ఇనుము ప్రమిదను ఉంచి ఆవనూనెతో ఎనిమిది వత్తులతో దీపారాధన చేయాలి.

ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయనమః అనే మంత్రాన్ని రోజూ 108 సార్లు జపం చేయాలి.