Shamantakamani Review

చిత్రం : శమంతకమణి
బ్యానర్ : భవ్య క్రియేషన్స్
దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత : వి.ఆనంద్ ప్రసాద్
సంగీతం : మణిశర్మ
విడుదల తేది : జులై 14, 2017
నటీనటులు : సుధీర్ బాబు, సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది, రాజేంద్రప్రసాద్ తదితరులు

తెలుగులో మల్టిస్టారర్ ట్రెండ్ ఇప్పటికే పూర్తి స్వింగ్ లో లేదు. అందులోనూ నలుగురేసి హీరోలున్న సినిమా చివరిసారి ఎప్పుడు విడుదల అయ్యిందో మనకు గుర్తు లేదు. అందుకే కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతూ సుధీర్ బాబు, సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది లాంటి యువహీరోలు శమంతకమణి అనే ట్రెండి సినిమా చేసారు.

కథలోకి వెళితే :

అయిదుగురు వ్యక్తులు, అయిదు కోట్లు విలువ చేసే ఓ కారు కథ ఇది. ఆ అయిదుగురు వ్యక్తులు, కృష్ణ (సుధీర్ బాబు), తల్లిని పోగొట్టుకొని, కోటీశ్వరుడు అయిన తండ్రితో సరైన సంబంధాలు లేకుండా ఉంటాడు, శివ (సందీప్ కిషన్)ని ప్రేమించిన అమ్మాయి వదిలేస్తుంది, కార్తిక్ (ఆది) ఆస్తిపరురాలైన గర్ల్ ఫ్రెండ్ తో ఎలా ఉండాలో తెలియని వాడు, అమెరికా వెళ్ళడం ఇతని కల. నాలుగు మహేష్ బాబు (రాజేంద్రప్రసాద్) తను ప్రేమిస్తున్న మహిళ (ఇంద్రజ) ని సుఖంగా చూసుకోవడం ఇతనికి కావాల్సింది. ఇక అయిదోవ వ్యక్తీ రంజిత్ కుమార్ (నారా రోహిత్). ఇతను డబ్బుకి ఆశపడే పోలీస్.

ఆ అయిదు కోట్ల కారు శమంతకమణికి కృష్ణ యజమాని. ఒక పార్టీకి కారు తీసుకొని వెళితే అది చోరి అయిపోతుంది. విషయం ఏమిటంటే, అప్పుడు ఆ పార్టి జరుగుతున్న హోటల్ లో శివ, మహేష్, కార్తిక్ కూడా ఉంటారు. ఇక హోటల్ బయటే రంజిత్ కుమార్ ఉంటాడు. ఇప్పుడు కారు ఎవరు కొట్టేసింది ఎవరో తెలియని పరిస్థితి. ఈ కథలో కృష్ణకి తప్ప, అందరికి డబ్బు అవసరం. మరి ఈ అయిదుగురిలో కారు కొట్టేసింది ఎవరు ? ఆసక్తికరమైన ఈ కథకి ముగింపు థియేటర్ లో చూడండి.