షకీల పెళ్లి కాలేదట!     2015-02-05   01:21:35  IST  Raghu V

Shakeela Condemns Marriage Rumors

నిన్నటి తరం యూత్‌ ప్రేక్షకులకు షకీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్‌ పాత్రలు పోషించడంలో ఈమెతోటి మరే నాయిక కూడా పోటీ పడలేక పోయింది. షకీల సినిమాలు వచ్చిన సమయంలో స్టార్‌ హీరోల సినిమాలు కూడా నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చేది. అంతటి క్రేజ్‌ను దక్కించుకున్న షకీల ఈ మద్య పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఈమె పెళ్లి చేసుకున్నట్లుగా ఒక ఫొటో కూడా తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తలను షకీల కొట్టి పారేసింది.

తాను పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆ ఫొటోలోని వ్యక్తి ప్రస్తుతం తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. అతని వయస్సు 28 సంవత్సరాలు, తన వయస్సు 38 సంవత్సరాలని, అతడు నాకు తమ్ముడితో సమానం అంటూ ఈమె క్లారిటీ ఇచ్చింది. షకీల స్పందనతో గత కొన్ని రోజులుగా మలయాళ మరియు తమిళ మీడియాలో వస్తున్న వార్తలకు బ్రేక్‌ పడ్డట్లయ్యింది. అయితే ఇంతకు షకీల పెళ్లి చేసుకోదా అనే అనుమానాలు మళ్లీ వ్యక్తం అవుతున్నాయి.