కండోమ్ వాడని $ex తో మరో పెద్ద ప్రమాదం

కండోమ్ తో చేసే $ex చాలారకాలుగా సురక్షితం. కండోమ్ అంటే మామూలుగా అది గర్భధారణని ఆపడానికి మాత్రమే పనికివస్తుంది అని అనుకుంటారు అంతా. కాని కండోమ్ కేవలం గర్భాన్నే ఆపడమే కాదు, జననాంగాలలో ఉన్న బ్యాక్టీరియా కుడా ఒకరినుంచి మరొకరికి వెళ్ళకుండా ఆపగలదు. ఈరోజుల్లో వన్ నైట్ స్టాండ్స్, డేటింగ్ అంటూ పెళ్ళికి ముందే $ex కానిస్తున్నారు అర్బన్ యువత. పెద్దగా పరిచయం లేని జనాలతో మేయింటేన్ చేస్తున్న సెక్సువల్ రిలేషన్ షిప్స్ వలనే ఇంఫెక్షన్లు బాగా సోకుతున్నాయని చెబుతున్నారు సెక్సాలాజిస్టులు.

మయామిలో గత ఎడాదికాలంగా దాదాపుగా 3500 స్త్రీలు $ex ఇంఫెక్షన్స్ తో హాస్పిటల్ దాకా వచ్చారట. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంటున్నారు డాక్టర్లు. జననాంగల సమస్యలతో అందరు బయటకి రాలేరని, కేవలం మయామిలోనే 5000 మందికి పైగా స్త్రీలు ఖచ్చితంగా $ex ఇంఫెక్షన్స్ తో బాధపడుతున్నారని అంచనా. ఈ లెక్క కేవలం అమ్మాయిలదే. అబ్బాయిలు కూడా $ex ఇంఫెక్షన్స్ తో బాధపడతారు. కాని స్త్రీలలోనే ఈ సమస్య ఎక్కువ అంట. ఈ సమస్యలకి మంచి పరిష్కారం కండోమ్ వాడటమే అని అంటున్నారు డాక్టర్ లెడ్జర్ బాస్కో.

కండోమ్ మీద అవగాహన సదస్సులో మాట్లాడుతూ “కండోమ్ కేవలం గర్భనిరోధక సాధనంగా భావిస్తున్నారు యువత. స్కిన్ టు స్కిన్ టచ్ కోసమని కండొమ్ లేకుండానే డేటింగ్ అంటూ, వన్ నైట్ స్టాండ్ అంటూ కొత్త కొత్త పరిచయాలతో కూడా $ex లో పాల్గొంటున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే, జననాంగాల శుభ్రత ఉండట్లేదు. దాంతో ఒకరి బ్యాక్టీరియా మరొకరి లోపలికి వెళ్ళిపోతోంది. వాల్వాలో ఉండే బ్యాక్టీరియా పురుషులకి కూడా చేటు చేస్తుంది. అయినా ఈ సమస్య మహిళల్లోనే ఎక్కువ. ఎందుకంటే యోని పురుషాంగానితో పోలిస్తే చాలా సెన్సిటివ్. చిన్న ఇంఫెక్షన్ కూడా పెద్దగా అయి, వైట్ డిశ్చార్జ్, పీరియడ్స్ లో డిశ్చార్జ్ రంగు మారడం, ఒక్కోసారి మరీ ఎక్కువ బ్లీడింగ్ జరగడం అవుతుంది. లైఫ్ స్టయిల్ ని తప్పుపట్టలేం .. ఈనాటి యువతీయువకులు అలానే ఉన్నారు. కాని జాగ్రత్తలు అవసరం. అవతలి వ్యక్తి అరోగ్యం కూడా మనకు అవగాహన లేనప్పుడు కండోమ్ లేకుండా $ex చేయకూడదు” అంటూ చెప్పారు డాక్టర్.