ఆడుకుందామని నమ్మించి ఆ బాలికను ఆ 5 మంది ఏం చేసారో తెలుస్తే కన్నీళ్లొస్తాయి.!  

అశ్లీల చిత్రాలు పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఇటీవల ఒక ఘటన ఉదాహరణంగా నిలిచింది.9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు బాలురు 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటన గురించి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు అందింది. అసలు వివరాల్లోకి వెళితే.. 9 నుంచి 14 ఏళ్ల మధ్యలో వయసున్న అయిదుగురు బాలలు మొబైల్ లో రెండు రోజుల పాటు పోర్న్ వీడియోలు చూసి 8 ఏళ్ల బాలికపై చెడుగా ప్రవర్తించారు.

సాహస్‌పూర్‌ చెందిన ఐదుగురు బాలురు, అక్కడే ఉన్న బాలికను ఆడుకుందామని నమ్మించి ఓ స్నేహితుడి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూసినట్లు నిందితుల్లో ఒకడైన బాలుడు తెలిపారన్నారు. అనంతరం బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాలలను అదుపులోకి తీసుకున్నారు.