ఉదయం పరగడుపున తేనే,నువ్వులను కలిపి తింటే షాకింగ్ ప్రయోజనాలు     2018-06-06   00:56:44  IST  Lakshmi P

తేనే లో ఉన్న లక్షణాల కారణంగా మనకు ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మన పూర్వీకుల కాలం నుండి తేనెను ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారు. తేనెను తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది. ఇక నువ్వుల విషయానికి వస్తే నువ్వుల నూనెను చాలా మంది వంటల్లో వాడుతూ ఉంటారు. ప్రతి రోజు ఒక స్పూన్ నువ్వులను తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు తేనే,నువ్వులను కలిపి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

తేనే,నువ్వులలో ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవీ శరీర నిర్మాణంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. ప్రోటీన్స్ కణజాలం పెంచటానికి,కాల్షియం ఎముకల బలానికి సహాయపడుతుంది. ఎదిగే పిల్లలకు వీటిని తినిపిస్తే పోషణ బాగా అంది బాగా పెరుగుతారు.

వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరచి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.