Secrets Your Tongue Reveals About Your Health

మనం సాదారణంగా డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు రొటీన్ చెకప్ లో బాగంగా నాలుకను చూస్తారు. మన నాలుక మొత్తం మన ఆరోగ్యాన్ని చెప్పేస్తుంది. నాలుకను చూసి అనేక రకాల వ్యాధులను ప్రాధమికంగా గుర్తించవచ్చు. నోటిలో చిగుళ్ళ తరువాత నాలుక మీదే ఎక్కువగా వ్యాధి కారకాలు నివసిస్తాయి. అయినప్పటికీ నాలుక అనేది మన శరీరంలో ఎక్కువ నిర్లక్ష్యం చేసే అవయవాలలో ఒకటిగా ఉంది. నాలుక ఒక అంతర్గత అవయవం అయిన సరే, బాహ్య అవయవాలను ఏ విధంగా అద్దంలో చూసుకుంటామో అలాగే నాలుకను కూడా చూస్తూనే ఉంటాం. నాలుక బహిర్గతం చేసే విషయాలను చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అనేక వ్యాధులను గుర్తించటంలో నాలుక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల మనం నాలుకను ఆరోగ్యకరముగా నిర్వహించవలసిన బాధ్యత ఉంది.

ఇక్కడ నాలుక మీద లక్షణాల బట్టి వివిధ ఆరోగ్య సమస్యలను ఎలా గుర్తించవచ్చో చూద్దాం.

1. ముదురు ఎరుపు రంగు

సాదారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క నాలుక గులాబి రంగులో ఉంటుంది. నాలుక ముదురు ఎరుపు రంగులో ఉంటే, అది రక్తహీనత, కవాసాకి వ్యాధి మరియు స్కార్లెట్ జ్వరం వంటి వాటికి సంకేతంగా భావించాలి.