సావిత్రి లాంటి మహానటి అన్ని కష్టాల్లో ఉంటే మరి సినిమా వాళ్లంతా ఏం చేస్తున్నట్టు ?     2018-05-29   00:16:24  IST  Raghu V

“మహానటి” సినిమా చూసిన మా అమ్మ నన్నొక ప్రశ్న అడిగింది….సావిత్రి లాంటి మహానటి అన్ని కష్టాల్లో ఉంటే మరి సినిమా వాళ్లంతా ఏం చేస్తున్నట్టు ??? ఆమెనే కాదు….చాలా మంది మనసులో నానుతున్న ప్రశ్న ఇది….. అనుభవంలో నేను చాలా చిన్నవాడిని…కానీ ఇండస్ట్రీ గురించి నాకు అర్థమైన భాషలో చెప్తాను….

సావిత్రి (గారు) చనిపోయేనాటికి ఆమె మహానటి కాదు……Fade Out అయిపోయిన ఒక నటి….ఆమె నటించే సినిమాలకి కానీ….ఆమెకి కానీ ఎటువంటి డిమాండ్ లేదు…. ఆవిడతో ఎవరికీ అవసరం కూడా లేదు….

ఈ రోజు మనకి జంధ్యాల అంటే ఎవరు….ఆహా నా పెళ్ళంట, శ్రీ వారికి ప్రేమలేఖ, చంటబ్బాయ్ లాంటి ఎన్నో గొప్ప సినిమాలు అందించిన ఒక మహా మనిషి…….కానీ ఆయన చనిపోయేనాటికి ష్ గప్చుప్…ఓహో నా పెళ్ళంట, విచిత్రం, అ ఆ ఇ ఈ, బాబాయ్ హోటల్ లాంటి 12-15 వరస అపజయాలతో ఉన్న ఒక దర్శకుడు…. ఈ రోజు అగ్ర హాస్యనటులు అనే ప్రతి ఒక్కరి జీవితం…ఆయన పెట్టిన భిక్ష….మరి ఈ రోజు ఆయన వర్ధంతి, జయంతి లాంటివి జరిగినప్పుడు ఆయన తొలి సినిమా హీరో ప్రదీప్ గారు తప్ప…ఆయన్ని స్మరించుకునే నాధుడు లేడు…. ఎందుకు ???

మరో రెండు ఉదాహరణలు చెప్పి …point లోకి వెళ్తాను….