సావిత్రి చనిపోయాక జెమిని గణేశన్ ఏం చేసాడో తెలుసా.? షాకింగ్ నిజం వెలుగులోకి.!     2018-05-27   00:02:47  IST  Raghu V

మహానటి సినిమాతో ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది సావిత్రి టాపిక్కే.ఒక నటి అనుకునేవారికి ఒక చరిత్ర అంటూ పరిచయం చేసిన సినిమా. అంత పెద్ద నటి ,సూపర్ స్టార్ వివాహం విఫలమై తన జీవితాన్ని చిదిమేసుకోవడమే ఇప్పుడు అందరిని తొలిచేస్తున్న విషయం.ప్రేమించి పెళ్లి చేసుకున్న జెమినియే సావిత్రిని మోసం చేశాడు అని అందరి అభిప్రాయము. సావిత్రిని అభిమానించేవారికి,తెలుగు సినిమా ప్రేక్షకులకు సావిత్రి జీవితం వరకూ జెమిని పెద్ద విలన్.మరి అంతటి విలన్ సావిత్రి చనిపోయిన తర్వాత ఏమయ్యాడు..జెమిని గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు..

జెమిని గణేశన్ ..జెమిని స్టూడియోస్ లో పనిచేయడంతో రామస్వామి గణేశన్ కి ఈ పేరు వచ్చింది.తమిళ నాడులోని పుదుక్కోటైకి చెందిన రామస్వామి సైన్సుగ్యాడ్యుయేట్..కొన్నాళ్లు లెక్చరర్ గా పనిచేశాడు.తమిళ సినిమాల్లో,కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించాడు..తమిళంలో పెద్ద హీరో,స్పోర్ట్స్ పర్సన్ కూడా..క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేశాడు..రుద్రవీణలో చిరంజీవి తండ్రిగా నటించింది ఈ జెమినినే. జెమిని స్టూడియోకి వచ్చినప్పుడే సావిత్రి కి జెమినితో పరిచయం.తర్వాత ఇద్దరూ మనం పోల్ మాంగల్యం అనే సినిమాలో నటించారు.వీరిద్దరి మనసులు అక్కడే కలిసాయి..అయితే అప్పటికే జెమినికి అలమేలుతో వివాహం అయి ఇద్దరు పిల్లలున్నారు..పుష్పవల్లి అనే నటితో వివాహేతర సంభందంలో ఉన్నాడు.. పుష్పవల్లి,జెమినిలకు పుట్టిన సంతానమే బాలివుడ్ నటి రేఖ..