ఆ విదేశీ యువతిని తెలుగు కార్ డ్రైవర్ ఎలా బుట్టలో పడేసాడో తెలుసా.? సరిహద్దులు దాటిన ప్రేమ!     2018-06-03   00:15:50  IST  Raghu V

కామారెడ్డికి చెందిన 23 ఏళ్ల యువకుడు బతుకుదెరువు వెతుక్కుంటూ సౌదీ వెళ్లాడు. అక్కడ ఓ బడా వ్యాపారి వద్ద డ్రైవర్‌గా చేరాడు. కారు డ్రైవర్ అయినా.. అతడి ప్రవర్తన నచ్చి ఆ వ్యాపారి కూతురు (27) ఆ యువకుడిపై మనసు పారేసుకుంది. ఆమెను పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని భయపడి ఆ యువకుడు స్వదేశం వచ్చేశాడు.

సౌదీలోని మ్యారేజ్ రూల్స్ ప్రకారం అక్కడ వివాహం చేసుకోవడం కుదరలేదు. దీంతో అజీముద్దీన్ 2018 జనవరిలో ఇండియాకి తిరిగి వచ్చాడు. అయినప్పటికీ అతడిపై ప్రేమను చంపుకోలేక పోయింది ఆ యువతి. సోషల్ మీడియా ద్వారా చాటింగ్, వీడియో కాల్స్, ఫోన్ మాట్లాడటం ఆపలేదు. ఈ క్రమంలో అజీముద్దీన్ పై పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ సౌదీ అమ్మాయి.. ఎలాగైనా ప్రియుడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. ఇండియాకు రావాలనకుంది. సౌదీలోని తన ఇంటి నుంచి అదే అడ్రస్ తో వీసాకు అప్లై చేస్తే విచారణలో ఈ విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందని భయపడింది. దీంతో తన ప్రేమ విషయం బయటపడితే ఇండియాకు రావడం వీలుకాదని భావించిన ఆ యువతి.. మే నెలలో టూర్ కు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి, నేపాల్ కు చేరుకుంది.