Sankranthi clash of Chiranjeevi and Balakrishna becomes official

తెలుగు సినీ చరిత్రలో బాక్సాఫీస్ పోటి అనగానే ఇటు మెగాస్టార్ చిరంజీవి, అటు యువరత్న బాలకృష్ణ గుర్తుకొస్తారు. కొద్ది గ్యాప్ లోనే కాదు, ఒకేరోజు ఇద్దరు తమ తమ సినిమాల్ని విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత వేడిగా ఉండేది వీరిద్దరి మధ్య పోటి. ఇక వీరి అభిమానుల సంగతి చెప్పనక్కరలేదు. ఆ వాడి వేరు, ఆ వేడి వేరు.

ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల తరువాత వీరిద్దరు మరోసారి బాక్సాఫీసు దగ్గర పోటి పడనున్నారు. సంక్రాంతికి ఖచ్చితంగా వస్తున్నాం అని నిన్న ఖైదీ నం.150 నిర్మాత రామ్ చరణ్ స్పష్టతనిస్తే, మేము కూడా సంక్రాంతి బరిలోనే ఉన్నాం అని గౌతమీపుత్ర శాతకర్ణి నిర్మాతలు ఈరోజు మళ్ళీ తేల్చి చెప్పారు. బాలయ్య 100వ సినిమా జనవరి 12న తేదిన కన్ఫర్మ్ అయిపోయింది. అయితే చిరంజీవి 150వ విడదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. జనవరి 12,13,14 .. ఈ మూడు తేదీల్లో ఏదో ఒకటి అయితే ఖాయం. మొత్తానికి మరోసారి మెగా – నందమూరి అభిమానుల మధ్య బాక్సాఫీసు వైరం జరగబోతోంది.

ఇక మిగితా వార్తల్లోకి వెళితే, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం యొక్క కొత్త పోస్టర్ ని ఈ నెల 9న విడుదల చేయనున్నారు. అలాగే 11వ తేదిన ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.