సంచలనం సృష్టిస్తున్న జనసేన నిర్ణయం ! తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

సాధారణ ఎన్నికలు సమీపించడంతో పాటు రాష్ట్రము లో అన్ని పార్టీలు ఎన్నికల కోసం అప్పుడే రంగంలోకి దిగిపోవడంతో ఇక ఎప్పటిలాగే సైలెంట్ గా చూస్తూ ఊరుకుంటే లాభంలేదనుకున్నాడో ఏమో కానీ జనసేనాని కూడా పొలిటికల్ బండి వేగం పెంచేసాడు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాయకులను పరీక్షలు పెట్టి మరీ ఎంపిక చేసుకుని రాజకీయ పార్టీల్లో కొత్త ఒరవడికి నాంది పలికింది. దీంతో చాలామంది జనసేన వైపు ఆకర్షితులయ్యారు. పనిలో పనిగా కొంతమంది జంపింగ్ జపాంగ్ లు సైతం జనసేన లోకి వెళ్లి భవిష్యత్తు వెతుక్కుందామనుకుని ఏర్పాట్లు చేసుకుంటుండగా అటువంటి వారికి పిడుగులాంటి వార్త వేసింది. ఏంటా వార్త ..? అసలు జనసేన లో ఏమి జరుగుతుంది ..? తెలుసుకుందాం !

జనసేనకి గ్రామస్థాయి నుంచీ కేడర్ లేకపోయినా కొన్ని కొన్ని చోట్ల పట్టు ఉంది..అందులోనూ కాపు సామాజిక వర్గ సప్పోర్ట్ కూడా మెండుగా ఉంది. ఇప్పుడు పార్టీని ప్రజలకి తీసుకువేల్లెందుకు పార్లమెంటరీ స్థాయిలో కమిటీలని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించేసింది కూడా అయితే ఇప్పుడు జనసేన పార్టీ ఉపాద్యక్షుడు ఒక కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన చాల మందికి మింగుడు పాడడం లేదు. బుధవారం కాకినాడ వచ్చిన జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. మహేందర్‌రెడ్డి..చాలా కీలక ప్రకటన చేశాడు. పార్లమెంటు స్థాయి కమిటీలను డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు…అయితే జనసేనలో కొత్తవారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నామని..ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నవారికి ఇస్తే జనసేన కి మిగతా వారికి పెద్దగా తేడా ఉండదు అని తేల్చి చెప్పేయడంతో పక్క పార్టీల నుంచి జనసేనవైపు తొంగి చూస్తున్న నాయకులకు గట్టి షాకే తగిలినట్టయ్యింది.

ఇప్పటికే పలు మార్లు జనసేన అధినేతను కలసి పార్టీ లో చేరికపై తన ఇష్టాన్ని చెప్పిన నెల్లూరుకు చెందిన వైసీపీ ఎమ్యెల్యేకి కూడా ఈ వార్త నిరాశే కలిగిస్తోంది. అయితే..ఏపీ, తెలంగాణల్లోని 42 లోక్‌సభ స్థానాల పరిధిలో 848 మందిని ఎంపిక చేశామని, డిసెంబరుకు వీరికి శిక్షణ పూర్తవుతుందని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలను రెండు ధపాలుగా ఏర్పాటు చేస్తాము అని తెలిపారు. పవన్ యవ్వారం చూస్తుంటే కొత్త కొత్త ప్రయోగాలతో అన్ని పార్టీలకంటే తమ పార్టీ చాలా భిన్నమైంది అనే సంకేతాలని ప్రజల్లోనూ, పార్టీ అభిమానుల్లోనూ కలిగించేలా వ్యవహరిస్తున్నాడు.