ఈమె ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు టాప్ హీరోల సరసన నటించిన హీరోయిన్.!     2018-05-23   22:57:11  IST  Raghu V

హీరోయిన్ సమీరా రెడ్డి గుర్తు ఉన్నారా? సూర్య సన్ అఫ్ కృష్ణన్ లో “మేఘన” గా ఎంతో మంది కుర్రకారుల హృదయాలను దోచుకున్న నటి. ఎన్టీఆర్‌తో అశోక్‌, బాలీవుడ్‌లో సైఫ్‌ అలీ ఖాన్‌తో రేస్‌ సినిమాలు తీసిన ఈమె, చాలా కాలానికి మళ్లీ అభిమానులకు కనిపించింది. అయితే సినిమాల్లో కాదండి.. సోషల్‌ మీడియాలో తాను పోస్టు చేసిన ఫోటోలతో.

ప్రస్తుతం ఆమె తల్లి బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. ముంబైకి చెందిన బిజినెస్‌మేన్ అక్షయ్ వార్దేను పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె వార్తల్లో కనిపించడం చాలా అరుదుగా మారారు. తాజాగా తన కొడుకు రేపు మూడో ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో, కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను అభిమానుల కోసం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.