Samantha Will Join Trs Party

సినీగ్లామ‌ర్ కోసం వెయిట్ చేస్తోన్న టీఆర్ఎస్ సైతం స‌మంతను పార్టీలో చేర్చుకునే విష‌యంలో క్లారిటీ ఉన్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆమె పార్టీలో చేరితే సికింద్రాబాద్ సీటు కేటాయించాల‌ని కేటీఆర్ తండ్రి వ‌ద్ద ప్ర‌పోజ‌ల్ పెట్టిన‌ట్టు కూడా రూమ‌ర్లు వ‌స్తున్నాయి. క్రిస్టియన్ మైనార్టీలు, సెటిల‌ర్లు ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్ నుంచి స‌మంత పోటీ చేస్తే, అక్క‌డ మంత్రిగా ఉన్న ప‌ద్మారావు ప‌క్క‌నే ఉన్న ముషీరాబ‌ద్‌కు షిఫ్ట్ అవుతార‌ని టాక్‌.

ఇది టీఆర్ఎస్‌లో కీ రోల్ పోషిస్తోన్న కేటీఆర్ తీసుకున్న నిర్ణ‌యం కావ‌డంతో కేసీఆర్ కూడా త‌ప్ప‌కుండా ఓకే చెపుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఏదేమైనా ఒక‌ప్పుడు ప్ర‌ముఖ సినీన‌టి జ‌య‌సుధ ప్రాధినిత్యం వ‌హించిన సీటు నుంచి స‌మంత బ‌రిలో ఉంటే సికింద్రాబాద్ పాలిటిక్స్‌లో మ‌రోసారి సినీగ్లామ‌ర్ వ‌చ్చిన‌ట్టే..!