Samantha – Kajal fights on Mersal sets ?

ఒకే కత్తికి రెండు ఒరలు ఉండటం ఎంత కష్టమో, అలాగే ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఉండటం అంతే కష్టం అని అంటుంటారు సినీజనాలు.‌ అందుకే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండే సినిమాల్లో ఒక స్టార్ హీరోయిన్, మిగితా వారు కుర్ర హీరోయిన్లు ఉంటారు. ఇద్దరు కూడా స్టార్ హీరోయన్లు అయితే ఈగో సమస్యలు వస్తాయి. తనకు అలాంటి బట్టలు, నాకు ఇలాంటి బట్టలు, తనకు అంత పారితోషికం, నాకు ఇంత రెమ్యునరేషన్ … ఇలా చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు గొడవ పడుతుంటారు. అందుకే స్టార్ హీరోయిన్లని ఒక సినిమాలో అరుదుగా చూస్తుంటాం మనం. అలాంటి అరుదైన కాంబినేషన్ బ్రహ్మోత్సవం సినిమాలో చూసాం.

అంతకుముందు కాజల్ – సమంత కలిసి సినిమా చేయలేదని కాదు. బృందావనంలో ఇద్దరు ఉన్నా, ఆ టైమ్ లో సమంత కాజల్ కి సమానమైన స్టార్ కాదు. కాని బ్రహ్మోత్సవం తీసేటప్పుడు ఇద్దరు స్టార్ హీరోయిన్లే. దాంతో ఇద్దరి మధ్య చాలా విషయాల్లో ఈగోలు అడ్డొచ్చి గొడవలు జరిగాయట. మళ్ళీ ఈ ఇద్దరు కలిసి ఓ సినిమాలో పనిచేయకూడదు అని అనుకున్నారట. కాని దర్శకుడు అట్లీతో సినిమా చేయాలనిపించిందో, విజయేంద్రప్రసాద్ కథని వదులుకోలేకపోయారో లేక తమకి సూపర్ హిట్స్ ఇచ్చిన విజయ్ తో మరోసాడి జోడి కట్టాలని చేసారో, మొత్తానికి మళ్ళీ ఈ ఇద్దరు ఒకే సినిమాని ఒప్పుకున్నారు. అదే తమిళ సినిమా మెర్సల్.

మరి ఈ కొత్త సినిమా సెట్లో అయిన వీరిమధ్య అమరికలు జరిగాయా అంటే లేదు అంట. ఇంకా ఇద్దరు ఎడమొఖం పెడముఖంగానే ఉన్నారట. సీన్ పూర్తయితే ఎవరి దారి వారిదే. ఒక్క మాట కూడా మాట్లాడుకోవట్లేదు. అదీకాక ఇద్దరి మధ్య సెట్లో మరో చిన్న గొడవ జరిగిందట. ఈసారి ఇద్దరు డైరెక్ట్ గా మాట అనుకోకుండా, తమ అసిస్టెంట్లతో తిట్ల దండకాన్ని పంపించారట.