రూ.950 ఇవ్వండి మామయ్యా..! నాగ్ కి అదిరిపోయే షాక్ ఇచ్చిన సమంత.! చివరికి ఏమైంది?     2018-06-23   02:07:10  IST  Raghu V

న‌టిగానే కాదు, సేవా దృక్ప‌థంతో అంద‌రి మ‌న‌సుల‌ని గెలుచుకున్న అందాల భామ సమంత‌. పెళ్ళికి ముందు నుండే ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ ప్ర‌త్యూష ఫౌండేష‌న్ అనే స్వ‌చ్చంద సేవా సంస్థని స్థాపించింది. దీని ద్వారా ఎంతో మంది అనాధ‌ల‌కి అండ‌గా ఉంటుంది స‌మంత. గ‌తంలో కొందరు సెలబ్రెటీలకు సంబంధించిన వస్తువులు.. దుస్తుల్ని వేలం వేసిన స‌మంత‌ ఆ మొత్తాన్ని ఫౌండేషన్ కు అందజేసింది. ఇక త‌న పెళ్లికి వచ్చిన గిఫ్ట్స్‌లో కొన్నింటిని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని కూడా ఫౌండేష‌న్‌కి అందజేసింద‌నే టాక్ న‌డిచింది. అయితే అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ అందుకున్న త‌ర్వాత స‌మంత‌పై మ‌రింత బాధ్య‌త పెరిగింది. కుటుంబంలో స‌భ్యురాలిగా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తూనే మ‌రోవైపు తోటి వారికి సేయం చేస్తుంది సామ్‌.

అయితే ఈ సేవా కార్యక్రమాల విషయంలోనే కొన్నిరోజుల క్రితం నాగ్ కు అనుకోని షాక్ ఇచ్చిందట సమంత. ఒక రూ.950 ఉంటే ఇవ్వండి మామయ్యా అంటూ అడిగేసరికి నాగార్జున మతిపోయిన వాడిలా వెర్రిచూపులు చూశాడట. తాను వింటున్నది నిజమేనా అనుకుంటూ ఆశ్చర్యంలో మునిగిపోయిన నాగ్.. సమంత వద్ద కనీసం రూ.950 కూడా లేకపోవడం ఏమిటి.. చైతూని అడగకుండా తనను అడగడం ఏమిటని అయోమయంలో పడిపోయాడట.