Salman accepts his defeat against Prabhas

సల్మాన్ ఖాన్ అంటే బాలివుడ్ టాప్ హీరో. ఆమీర్ ఖాన్ రెండేళ్ళకి ఒకసారి వచ్చి రికార్డులు బద్దలు కొడతాడు కాని సల్మాన్ మాత్రం ఏడాదికి ఓ రెండు సినిమాలు తీసి భారీ బ్లాక్ బస్టర్లు కొడతాడు. 500 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమా సల్మాన్ కి రెండున్నాయి. వంద కోట్ల నెట్ క్లబ్ లో పది సినిమాలి కలిగిన ఏకైక హీరో సల్మాన్. సినిమాకి 50 కోట్లు తీసుకోవడం మొదలుపెట్టిన హీరో కూడా సల్మాన్ ఖానే. కాని ఇంతటి ఖాన్ కూడా ఇప్పుడు బాహుబలి దెబ్బకు బిత్తరపోయాడు. ఆ రికార్డులు చూసి నోరు వెళ్ళబెడుతున్నాడు. ఆ రికార్డుల దగ్గరికి చేరుకోవడం తన వల్ల కాదని అల్రేడి చేతులు ఎత్తేసాడు.

సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ట్యూబ్ లైట్ ఈ నెల 24న విడుదల అవుతోంది. సల్మాన్ తో రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన కబీర్ ఖాన్ ఈ సినిమాకి దర్శకుడు. బజరంగీ భాయిజాన్ తో 600 కోట్లు కొల్లగొట్టాడు కబీర్. అలాంటి ద్వయం తీసుకొస్తున్న సినిమా అయినా, ట్యూబ్ లైట్ పెద్దగా అంచనాలు లేవు. ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయలేదని స్వయంగా హీరోనే ఒప్పుకుంటున్నాడు.

మన ప్రభాస్ పేరిట ఉన్న రికార్డులు ఒక్కటి కూడా ట్యూబ్ లైట్ బ్రేక్ చేయలేదు అంటూ సల్మాన్ నిర్మొహమాటంగా చెప్పేసాడు. అలాగే బాహుబలిని ఉత్తరాది వారు ఆదరించినట్టుగా, ట్యూబ్ లైట్ ని దక్షిణాది ప్రేక్షకులు ఆదరించడం కష్టమని, ఏ సినిమా అయినా బాహుబలిని కొట్టాలంటే, రాష్ట్రాలతో, ప్రాంతాలతో తేడా లేకుండా బాహుబలి లాగే ఆడాలని సల్మాన్ అభిప్రాయపడ్టాడు.