అభిమాన హీరోతో నటించనున్న సాయిపల్లవి.! ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?    2018-06-07   02:55:11  IST  Raghu V

సాయి పల్లవి ప్రస్తుతం ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ప్రస్తుతం ఆమె తెలుగులో,తమిళం లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.ఇక ఆమె కు మలయాళం లో ప్రేమం సినిమాతో క్రేజ్ ఒక రేంజ్ లో వస్తే ఇక్కడ ఫిదా సినిమా తో ఆ క్రేజ్ ఇక్కడ కూడా వచ్చింది.

తాజాగా ఆమె ఆటో నేర్చుకుంటోందనే రూమర్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ బ్యూటీ తన అభిమాన హీరో సూర్యతో జతకట్టనున్నారు.అంతేకాక కోలీవుడ్‌లో మొదటి సినిమా ‘దియా’ కాస్తా నిరాశ పరిచింది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన దియా తెలుగులోనూ సక్సెస్‌ కాలేదు. కానీ తన నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. కోలీవుడ్‌లో మరో రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అందులో ఒకటి తన అభిమనా హీరో సూర్యతో నటిస్తోంది. ‘ఎన్‌జీకే’ పేరుతో సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రం దీపావళికి తెరపైకి వచ్చే అవకాశం ఉంది