Sai Pallavi undergone treatment for pimples ?

ఒక ఇండస్ట్రీలో సక్సెస్, స్టార్ స్టేటస్ సంపాదించడమే కష్టమైన విషయం అనుకుంటే మళయాళ ముద్దుగుమ్మ సాయిపల్లవి తన మొదటి చిత్రాలతోనే రెండు చోట్ల స్టారయ్యి కూర్చుంది. ప్రేమమ్ తో మళయాళ మనుషులని మాత్రమే కాదు, యావత్ దక్షిణభారత దేశాన్ని మాయలో పడేసిన ఈ మలార్, కొత్త ఫిదాలో మెప్పించి తెలుగునాట విశేషమైన అభిమాన గణాన్ని సంపాదించుకుంది. అందుకు కారణం అమె టాలెంట్, అలాగే సింప్లిసిటి. మొహం మీద మొటిమలతో నటించిన మొదటి హీరోయిన్ తనే కావొచ్చు. కాని ఆ నేచురల్ బ్యూటియే అమెను స్టార్ చేసింది‌. అంతేకాదు, మొటిమలతో ఇబ్బందిపడే యువతీయువకులకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది.

అయితే నిన్న మొన్న సాయి పల్లవిని చూసినవారు చిన్న షాక్ కి గురయ్యారు‌. ఒక్కసారిగా మొటిమలు తగ్గిపోయాయి. ఇప్పటికే మొటిమలతో మూడు నాలుగు సినిమాలు చేసిందిగా. ఇంకా అలానే ఉంటే ఆ సింప్లిసిటి కాస్త బోర్ కొట్టేస్తుంది అనుకుందో ఏమో, చాలా కొత్తగా కనిపించింది బయట. మరి మొటిమలు కనబడకుండా మేకప్ వేసుకుందో లేక ఇక ఈ మొటిమలు పెర్మనెంట్ గా వద్దు అనుకుంటూ లేజర్ ట్రీట్‌మెంట్ చేయించుకుందో తెలియదు. బహుషా మేకప్ వేసుకుందేమో. ఎందుకంటే నానితో చేస్తున్న MCA ఇంకా పూర్తవలేదు కదా. కొన్ని సీన్లలో మామూలుగా మొటిమలతో, కొన్ని సీన్లలో మొటిమలు లేకుండా కనిపిస్తే బాగుండదు కదా. అయినా లేజర్ ట్రీట్‌మెంట్ చేయించుకున్నా, మళ్ళీ మొటిమలు రావు అన్న గ్యారంటీ ఉండదు‌ కదా.

ఇప్పటివరకైతే ఆ మొటిమలే పెద్ద ప్లస్. ఆ మొటిమల వలన, చెంపలు ఎర్రగా ఉండటం వలన క్యూట్ గా ఉంటుంది అంటారు జనాలు. మరి జనలాకి నచ్చిన విషయాన్ని పల్లవి అలా వదిలేసుకుంటుంది అంటారా ?Sai Pallavi undergone treatment for pimples ?