ఆర్‌ఎక్స్‌100 హీరోయిన్‌ పారితోషికం ఎంతో తెలిస్తే షాక్‌  

కార్తికేయ హీరోగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌100’. ఏమాత్రం అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ను దక్కించుకుంది. కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది అంటూ సమాచారం అందుతుంది. ఈ చిత్రంలో కనిపించిన నటీనటుల్లో రావు రమేష్‌ మాత్రమే పెద్ద నటుడు. ఆయన పారితోషికం మినహా మిగిలిన వారిది అందరికి కూడా అయిదు పది లక్షలే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన పాయల్‌కు కేవలం 6 లక్షల పారితోషికమే దక్కినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

ఈ చిత్రంలో కార్తికేయ మరియు పాయల్‌ల రొమాన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. వీరి లిప్‌లాక్‌ సీన్స్‌ వల్లే సినిమాకు విపరీతమైన హైప్‌ వచ్చింది. ఆ హైప్‌ కారణంగా మంచి ఓపెనింగ్స్‌ రావడం జరిగింది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో మొదటి మూడు రోజుల్లో ఏకంగా అయిదు కోట్ల వరకు వసూళ్లు సాధ్యం అయ్యాయి అంటూ సమాచారం అందుతుంది. ఇంతటి భారీ వసూళ్లను చిత్ర యూనిట్‌ సభ్యులు కనీసం ఒక్క శాతం కూడా ఊహించలేదు. ఇదంతా కూడా ఖచ్చితంగా హీరోయిన్‌ ప్రభావం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాకు కోట్లు తెచ్చి పెడుతున్న హీరోయిన్‌ పాయల్‌ ఈ చిత్రంలో నటించేందుకు కేవలం ఆరు లక్షలు తీసుకుంది అంటూ జరుగుతున్న ప్రచారం ఆశ్చర్యంను కలిగిస్తుంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు లక్షల్లో పారితోషికాలు తీసుకుంటూ ఉంటే, ఈమె ఇంత తక్కువ పారితోషికం తీసుకోవడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు. ఆరు లక్షల పారితోషికానికే ఏకంగా 20 ముద్దు సీన్స్‌లో నటించడంతో పాటు, చాలా రొమాంటిక్‌గా, బోల్డ్‌గా నటించింది. తీసుకున్న పారితోషికంకు 100 రెట్టు గ్లామర్‌ను చూపించడంతో పాటు, నటించింది. సినిమాలో పాయల్‌ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోయిన్‌గా కనిపించింది.

ఈ అమ్మడు సినిమా విడుదలైన తర్వాత నిర్మాత నుండి భారీ మొత్తంలో బహుమానం రూపంలో డబ్బును అందుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఆరు లక్షలేనా అంటూ వెనకడుగు వేయకుండా మంచి పాత్ర అనే ఉద్దేశ్యంతో పాయల్‌ ఈ చిత్రానికి కమిట్‌ అవ్వడం ఆమె కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. పాయల్‌ ఈ చిత్రం తర్వాత తెలుగులో మంచి హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకున్న వారే స్టార్స్‌ అవుతారు. అలాంటి అవకాశం పాయల్‌కు వచ్చింది, దాన్ని వినియోగించుకుని స్టార్‌ అయ్యింది.