వెంకయ్య తో మోడీ కి చెక్..ఆరెస్సెస్ తాజా వ్యూహం     2018-06-06   02:22:49  IST  Bhanu C

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు..అప్పటి వరకూ మంత్రిగా ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యిపోవచ్చు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు మంత్రులుగా మారిపోవచ్చు ఊహించని పరిణామాలు అత్యంత వేగంగా జరగడం కేవలం రాజకీయాలలో మాత్రమె సాధ్యం అవుతుంది..అయితే గత కొన్ని రోజులుగా మోడీ ని ఈ సారి ప్రధాని అభ్యర్ధిగా తప్పించే పనిలో ఆరెస్సెస్ పావులు కడుపుతోందని అంటున్నారు విశ్లేషకులు అందుకు తగ్గట్టుగానే పరిణామాలు కూడా చక చకా కదులుతున్నాయని తెలుస్తోంది..

అయితే ఈ పరిణామాలు మోడీ టీం కి నిద్రపట్టకుండా చేస్తున్నాయి..మోదీ కారణంగా బీజేపీ మళ్లీ ప్రతిపక్షానికి పరిమితం కావడం ఇష్టం లేని ఆర్ఎస్ఎస్… మోదీనే బీజేపీకి దూరంగా పెట్టాలనే ఆలోచనతో ఉందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి…ప్రణబ్ ను ఆర్ఎస్ఎస్ సమావేశాలకు ఆహ్వానించడం వెనుక అసలు కారణం కూడా ఇదేనని ప్రచారం కూడా జరుగుతోంది..ఈ క్రమంలోనే గడ్కరీ, రాజ్ నాథ్ పేర్లను పరిశీలిస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఆర్ఎస్ఎస్ లోని కొందరు నాయకులు మాత్రం మోదీకి ప్రత్యామ్నాయం వెంకయ్యనాయుడు ఎందుకు కాకూడదనే వాదనను తెరపైకి తెచ్చారని అంటున్నారు…ఈ ప్రశ్నతో ఒక్కసారిగా రాజకీయ ముఖచిత్రం మారిపోయిందట..