ఏపీ పై మోడీ,షా ల ప్లాన్ బెడిసికొట్టిందిగా..వాట్ నెక్స్ట్     2018-07-02   02:19:54  IST  Bhanu C

ఏపీ అభివృద్దిలో మా సహకారం పూర్తిగా ఉంటుంది అంటూ ప్రగల్భాలు పలికిన మోడీ జీ ఆ తరువాత ఇచ్చిన మాటలు అన్నిటినీ గాలికి వదిలేసి ఎలా వెన్నుపోటు పోడిచారో అందరికీ తెలిసిన విషయమే..అయితే ఆ సమయంలో కూడా మోడీ షా లు ఏపీ పై పట్టు సాధించడం కోసం కొంతమంది నేతలతో ఏపీపై కుట్ర రాజకీయాలు నడిపించారు..కర్ణాటక ఎన్నికల తరువాత ఏపీలో చంద్రబాబు తెలుగుదేశం తుడిచిపెట్టుకుని పోతాయి అంటూ చేసిన వ్యాఖ్యల అనంతరం అక్కడ ఘోరంగా ఓడిపోయిన బీజేపీ ఆ ఎఫెక్ట్ తో ఆ పై కాశ్మీర్ లో కూడా బిజేపీ పాచికలు పారకపోవడంతో తెగ ఇబ్బంది పడ్డారు..దాంతో తమ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి..ఆ పరిణామాలతో ఏపీలో బీజేపి పరిస్థితి మరింత ఘోరంగా మారిపోయింది..

ఏపీలో బీజేపీ పేరు ఎత్తితేనే ఒంటికాలిపై లేస్తున్న ప్రజలని చూస్తుంటే భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది దాంతో ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపడుతోంది..అందులో బాగంగానే మోడీ షా లు ఒక వ్యూహాన్ని సిద్దం చేశారు అదేంటంటే..బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి విస్తృత ప్రచారం చేయడం ఇందులో ముఖ్యమైంది. కేంద్రం బోలెడన్ని నిధులు ఇస్తోందనీ… ఏపీ ప్రభుత్వం తప్పిదాల వల్లే నిధులు రాకుండా ఆగిపోయాయని జనానికి తెలిపి ఈ వివరాలని మరియు ఎపీకి చేసిన మేలుని ఆర్ఎస్ఎస్‌ పెద్దలను కలిసి వారితో సమావేశం ఏర్పాటు చేసుకుని చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది..