RSS ఎఫెక్ట్..చంద్రబాబు పై మోడీ ప్రశంసలు.    2018-06-18   03:37:03  IST  Bhanu C

గడిచిన కొన్ని నెలలుగా మోడీ..ఏపీ సీఎం చంద్రబాబు ని ఎన్ని ముప్పుతిప్పలు పెట్టాడో అందరి తెలిసిందే అయితే నీతీ ఆయోగ్ వేదికగా ఒక్క సారిగా మోడీ చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించారు..ఎన్నో సార్లు మోడీ ని కలవడం కోసం ఏపీ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం..బాబు దాదాపు 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారు అయినా సరే మోడీ చంద్రబాబు ని కలవలేదు అయితే మొదటి సారిగా నీతి ఆయోగ్ సమావేశం లో కలుసుకోవటం ప్రత్యేక ఆకర్షణ గా నిలచింది.

అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే నీతి ఆయోగ్ లో కనీసం మోడీ ని పట్టించుకోకుండా చంద్రబాబు వెళ్ళిపోయారు..అయితే మోడీ తరువాత విరామసమయం లో వచ్చి మరీ చంద్రబాబు ని పలకరించారు..అంతే కాదు తన ప్రసంగంలో సీఎం చందబాబుపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. విద్యుత్‌రంగంలో చంద్రబాబు కృషి అభినందనీయమని మోదీ కొనియాడారు…దాంతో నీతిఆయోగ్‌ సమావేశంలో చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు…మోడీ కి బాబు కి ఉన్న బ్యాడ్ రిలేషన్ ఎప్పుడూ చూస్తూ వస్తున్న ఇతర రాష్ట్రాల సీఎం లు ఒక్కసారిగా అవ్వక్కాయారు..