“బాపట్ల” కుర్రాడు...“అమెరికాలో రికార్డు” సృష్టించాడు..     2018-05-06   00:30:31  IST  Bhanu C

“ఇందుగలడు అందు గలడనే సందేహం లేదు ఎందెందు వెతికినా సరే అందందు కలడు భారతీయుడు.” దేవుడికి సంభందించిన ఈ పద్యం ఇప్పుడు విదేశాలలో ఉన్న ఎంతో మంది భారతీయులకి కూడా వర్తిస్తోంది..భారతీయుడు ఎక్కడ ఉన్నా సరే భారత దేశ గడ్డ యొక్క సత్తా ని చూపించడంలో మనకి సాటి మనమేనన్న సూత్రాన్ని మాత్రం తప్పకుండా పాటిస్తాడు..దేశ విదేశాలలో విదేశీ ఎప్పటికప్పుడు భారత జెండాని రెపరెపలాడిస్తూ ఉంటాడు..వివరాలలోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, బాపట్లకు చెందిన రోహిత్‌ వుల్చి ఏజీ స్కాలర్‌ అవార్డుకు ఎంపికయ్యారు…విన్సెంట్‌ ఈ పెట్రుస్సీ విటి కల్చర్‌ బిల్డింగ్‌లో కాలిఫోర్నియా 23వ డిస్ట్రిక్ట్‌ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జిమ్‌ పాట్టర్‌సన్‌ చేతుల మీదుగా రోహిత్‌ ఏజీ స్కాలర్‌ అవార్డును అందుకున్నారు..రోహిత్ బాపట్లలో అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో చదువుకున్న తరువాత ఉన్నతమైన చదువుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో అగ్రికల్చరల్‌ విభాగంలో మాస్టర్స్‌ చేస్తున్నారు.