మంచోడు అంటూనే మసి పూస్తున్నారు!     2018-06-25   22:01:01  IST  Raghu V

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో సామాన్యులకు ఛాన్స్‌ ఇచ్చారు. ముగ్గురు సామాన్యులు సెలబ్రెటీలతో కలిసి హౌస్‌లోకి వెళ్లారు. సెలబ్రెటీలతో సామాన్యులు ఎలా మసుకుంటారో అంటూ అంతా ముందు నుండి భావించారు. అంతా అనుకున్నట్లుగానే బిగ్‌బాస్‌లో సామాన్యులతో సెలబ్రెటీలు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న సెలబ్రెటీలు కూడా స్టార్స్‌ ఏమీ కాదు. అయినా కూడా వారి పద్దతి కాస్త విభిన్నంగా ఉండటంతో పాటు, సామాన్యును చిన్న చూపు చూస్తూ వారిని తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లిన ముగ్గురు సామాన్యుల్లో సంజన, నూతన్‌ నాయుడులు ఇద్దరు బయటకు వచ్చేశారు. ఇక మిగిలి ఉన్న సామాన్యుడు గణేష్‌ మాత్రమే. ఇతడు కూడా ఈ వారం నామినేట్‌ అయ్యాడు. ఇంటి సభ్యులు ఎక్కువగా నామినేషన్స్‌ గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో బిగ్‌బాస్‌ ఈసారి ఓపెన్‌ నామినేషన్‌ పక్రియను నిర్వహించడం జరిగింది. బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్న సగం మంది గణేష్‌ను నామినేట్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే గణేష్‌ను నామినేట్‌ చేసిన ప్రతి ఒక్కరు కూడా అతడు మంచి వాడే కాని, అతడు ఇక్కడ సర్దుబాటు కాలేక పోతున్నాడు అంటూ చెబుతూ మెడలో నామినేటెడ్‌ ట్యాగ్‌ వేశారు.